భగవంతున్ని కొనడానికి మా దగ్గర బడ్జెట్ లేదు బ్రో.. : వైరల్ అవుతున్న చాహల్, రాహుల్, లార్ఠ్ ఠాకూర్ ల సంభాషణ

By Srinivas MFirst Published Jan 28, 2022, 1:50 PM IST
Highlights

Lord Shardul Thakur: ఐపీఎల్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో తరఫున ఆడేందుకు పలువురు క్రికెటర్లు ఆసక్తి చూపుతున్నారు. మెగావేలం నేపథ్యంలో టీమిండియా లో అభిమానులు ‘లార్డ్’గా పిలుచుకునే...
 

ఐపీఎల్ వేలానికి సమయం దగ్గరపడుతున్నది.  వచ్చే నెల 12, 13 తేదీలలో  ఈ క్యాష్ రిచ్ లీగ్  కు బెంగళూరు వేదికగా వేలం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే  పాత 8 జట్లతో పాటు కొత్తగా చేరిన రెండు జట్లు కూడా తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల పేర్లను  ప్రకటించాయి. ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన  లక్నో సూపర్ జెయింట్స్ కు కెఎల్ రాహుల్  సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లలో పలువురు అతడిని  లక్నో జట్టులో చేర్చుకోమని కాకా పడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. 

రాహుల్ కోసం లక్నో రూ. 17 కోట్లు వెచ్చించింది. ఈ నేపథ్యంలో తనను కూడా లక్నోకు తీసుకోవాలని  భారత యువ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ అతడిని కోరాడు. దీనికి  టీమిండియా స్పిన్నర్  యుజ్వేంద్ర చాహల్.. అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.

వివరాల్లోకెళ్తే... దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకున్న భారత జట్టు  ఓ హోటల్ లో భోజనం చేస్తన్నప్పుడు ఈ వీడియోను షూట్ చేసినట్టు తెలుస్తున్నది.  ఇక వీడియోలో  శార్దూల్ ఠాకూర్..  ‘నా కోసం మీరు ఎంత ఖర్చు పెట్టగలరు...?’ అని రాహుల్ ను అడిగాడు. దీనికి  రాహుల్ స్పందిస్తూ... ‘బేస్ ప్రైస్ (కనీస ధర)’  అని నవ్వుతూ సమాధానం చెప్పాడు. 

 

ఇదే సమయంలో అక్కడే ఉన్న చాహల్ స్పందిస్తూ..  ‘భగవంతుని కోసం బడ్జెట్ ఏముంటుంది  బ్రో..’ అని కౌంటర్ ఇచ్చాడు. శార్దూల్ ఠాకూర్ ను టీమిండియా అభిమానులంతా  ‘లార్డ్ శార్దూల్ ఠాకూర్’ అని పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ చాహల్ కౌంటర్ వేశాడు.  ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

ఇదిలాఉండగా.. శార్దూల్ ఠాకూర్ గతంలో ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడేవాడు. కానీ ఈ ఏడాది రిటెన్షన్ ప్రక్రియలో చెన్నై అతడిని రిటైన్ చేసుకోలేదు.  అయితే వేలంలో మాత్రం చెన్నై అతడిని దక్కించుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.  ఇక మరోవైపు యుజ్వేంద్ర చాహల్  కూడా గతంలో ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడేది అనుమానంగానే ఉంది. రిటెన్షన్ ప్రక్రియలో  ఆర్సీబీ అతడిని రిటైన్ చేసుకోలేదు.  
 

click me!