కాస్త హుందాగా ఉండు.. గంగూలీని టీజ్ చేసిన యూవీ

By telugu news teamFirst Published Feb 14, 2020, 9:57 AM IST
Highlights

సౌరవ్ గంగూలీ తన పాత స్మృతులను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేశాడు.  1996లో ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో తన టెస్టు అరంగేట్రంలో సాధించిన సెంచరీ ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా  గంగూలీ పంచుకున్నాడు.సౌరవ్ గంగూలీ తన పాత స్మృతులను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేశాడు.  1996లో ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో తన టెస్టు అరంగేట్రంలో సాధించిన సెంచరీ ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా  గంగూలీ పంచుకున్నాడు.

టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని హుందాగా వ్యవహరించాలంటూ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ చురకలు వేశాడు.  గంగూలీని యూవీ అంతమాట ఎందుకున్నాడా అని డౌట్ మీకు రావొచ్చు. అయితే.... టీజ్ చేస్తూ సరదగా అలా అన్నాడు.

ఇంతకీ మ్యాటరేంటంటే...  సౌరవ్ గంగూలీ తన పాత స్మృతులను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేశాడు.  1996లో ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో తన టెస్టు అరంగేట్రంలో సాధించిన సెంచరీ ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా  గంగూలీ పంచుకున్నాడు.

Also Read కివీస్ పై చెత్త ప్రదర్శన: అగ్రస్థానాన్ని కోల్పోయిన బుమ్రా...

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Fanatastic memories ...

A post shared by SOURAV GANGULY (@souravganguly) on Feb 12, 2020 at 9:50am PST

 

ఆ మ్యాచ్‌లో గంగూలీ సెంచరీ చేసిన తర్వాత సెలబ్రేషన్స్‌ చేసుకుంటుంటే ఆ వెనకాల రాహుల్‌ ద్రవిడ్‌ ఉన్నాడు. గూగుల్‌లో సెర్చ్‌ చేసి మరీ గంగూలీ ఆనాటి ఫొటోనే షేర్‌ చేశాడు. వాటర్‌ మార్క్‌తో కూడిన ఫొటోను గంగూలీ పోస్ట్‌ చేసి అదొక చిరస్మరణీయమైన క్షణం అని క్యాప్షన్‌ ఇచ్చాడు. మరి దీనికి యువరాజ్‌ తనదైన శైలిలో ఆట పట్టించాడు. ప్రధానంగా ఒక ఏజెన్సీకి సంబంధించిన ఆ ఫోటోపై వాటర్‌ మార్క్‌ను యువీ ప్రస్తావించాడు.‘దాదా.. నువ్వు బీసీసీఐ ప్రెసిడెంట్‌వి. ప్లీజ్‌ దయచేసి హుందాగా ఉండు’ అని పేర్కొన్నాడు. 

click me!