ప్రపంచ అవార్డ్ ని రెండు ముక్కలు చేసుకున్న యశశ్వి జైశ్వాల్

By telugu news teamFirst Published Feb 14, 2020, 7:40 AM IST
Highlights

‘ ఇలా జరగడం ఇదేమీ తొలిసారి కాదు. యశశ్వి ఎప్పుడూ పరుగుల గురించి మాత్రమే ఆలోచిస్తాడు. ట్రోఫీల గురించి ఆలోచించడడు. ఆ ట్రోఫీ విరిగిపోయినందుకు కనీసం బాధకూడా పడడు’ అని చెప్పారు. 

మనకు ఏదైనా ఆటలోనే, ఇంకెందులోలైనా చిన్న బహుమతి వచ్చిందనుకోండి... దానిని ఏం చేస్తారు..? చాలా జాగ్రత్తగా దాచుకుంటారు అవునా.. కానీ ఇండియన్ క్రికెటర్ యశశ్వి జైశ్వాల్ మాత్రం తన ట్రోఫీని రెండు ముక్కలు చేసుకున్నాడు.  ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారం యశశ్వికి దక్కింది.

Also Read అమ్మాయిలకు సెక్సీగా కనిపించాలని....: గుట్టు విప్పిన రస్సెల్..

దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి వచ్చాక చూస్తే... ఆ ట్రోఫీ రెండు ముక్కలయ్యింది. కనీసం అది అలా ఎలా అయ్యిందో కూడా అతనికి తెలియకపోవడం గమనార్హం.  దీని  గురించి యశశ్వి కోచ్ జ్వాలా సింగ్ మాట్లాడారు.

‘ ఇలా జరగడం ఇదేమీ తొలిసారి కాదు. యశశ్వి ఎప్పుడూ పరుగుల గురించి మాత్రమే ఆలోచిస్తాడు. ట్రోఫీల గురించి ఆలోచించడడు. ఆ ట్రోఫీ విరిగిపోయినందుకు కనీసం బాధకూడా పడడు’ అని చెప్పారు. 

మరోవైపు ఫైనల్స్ లో చెత్త షాట్ ఆడి జైశ్వాల్ ఔటయ్యాడు. ఈ విషయంలో చాలా బాధపడ్డాడు అట. ‘ నేను చెత్త షాట్ ఆడాను. ఆ సమయంలో అది అనవసరం. నును ఊహించిన దానికన్నా బంతి చాలా వేగంగా వచ్చింది. అంతకు ముందే నెమ్మదిగా వస్తున్న బంతిని ఎదుర్కొన్నాను. ప్రపంచకప్ గెలిస్తే బాగుండేది. కానీ.. దీనితోనే ప్రపంచం ముగిసిపోదుగా’ అని  యశశ్వి పేర్కొన్నాడు. 

click me!