ఈ ఏడాది వన్డే మ్యాచ్‌లలో భారత బ్యాట్స్‌మెన్లు అద్భుతంగా రాణించారు. టాప్ మూడు స్థానాల్లో మనోళ్లే ఉన్నారు. అత్యధికంగా శుభ్‌మన్ గిల్, ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఉన్నారు. మరో విశేషం ఏమిటంటే.. అత్యధిక ఫోర్లు, సిక్స్‌లు కొట్టింది కూడా మనోళ్లే.
Year Ender 2023: ఈ ఏడాది వన్డేల్లో మన బ్యాట్స్‌మెన్లు ఇరగదీశారు. కొత్త కెరటం శుభ్‌మన్ గిల్ తన సత్తా చూపాడు. ఈ ఏడాది టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతేకాదు, అత్యధిక ఫోర్లు(180 ఫోర్లు) దంచిన బ్యాటర్‌గా కూడా శుభ్‌మన్ గిల్ రికార్డు తన పేరిట రాసుకున్నాడు. అత్యధిక సిక్స్‌లు(67 సిక్స్‌లు) బాదిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో శుభ్‌మన్ గిల్ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నారు.
శుభ్‌మన్ గిల్:
ఈ ఏడాది శుభ్‌మన్ గిల్ 29 మ్యాచ్‌లలో 1584 పరుగులు(29 ఇన్నింగ్స్‌లో) సాధించాడు. ఇందులో హైయెస్ట్ స్కోర్ 208. ఈ మ్యాచ్‌లలో మొత్తంగా 180 ఫోర్లు, 41 సిక్స్‌లు బాదాడు.
విరాట్ కోహ్లీ:
విరాట్ కోహ్లీ ఈ ఏడాది టాప్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. 27 మ్యాచ్‌లలో 24 ఇన్నింగ్స్‌లలో మాత్రమే ఆడాడు. ఇందులో 1377 పరుగులు రాబట్టాడు. అత్యధిక స్కోర్‌గా అజేయ 166 పరుగులు. ఈయన 122 ఫోర్లు, 24 సిక్స్‌లు కొట్టాడు.
రోహిత్ శర్మ:
27 మ్యాచ్‌లలో 26 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 1255 రన్స్ కొట్టాడు. హైయెస్ట్ 131 రన్స్. 131 ఫోర్లు, 67 సిక్స్‌లు బాదాడు. ఈ ఏడాదిలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మన్ రోహిత శర్మనే.
డీజే మిచెల్:
26 మ్యాచ్‌లలో 25 ఇన్నింగ్స్‌లో స్ట్రైకింగ్ తీసుకుని 1204 రన్స్ సాధించాడు. న్యూజిలాండ్‌కు చెందిన ఈ ఆటగాడు 93 ఫోర్లు, 37 సిక్స్‌లు కొట్టాడు.
పి నిస్సంకా:
29 మ్యాచ్‌లలో 29 ఇన్నింగ్స్‌లు ఆడి 1151 పరుగులు సాధించాడు.ఈ శ్రీలంక బ్యాట్స్‌మన్ 156 ఫోర్లు, 6 సిక్స్‌లు బాదాడు.
Also Read: MS Dhoni: సచిన్ తర్వాత మళ్లీ ధోనీకే ఆ గౌరవం.. ఐకానిక్ జెర్సీ 7 మాహీకే అంకితం.. ఇక కనిపించదంతే!
బాబర్ ఆజాం:
25 మ్యాచ్‌లకు గాను 24 ఇన్నింగ్స్‌లలో 1065 పరుగులు సాధించాడు. పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ 97 ఫోర్లు, 14 సిక్స్‌లు బాదాడు.
మొహమ్మద్ రిజ్వాన్:
ఈ పాకిస్తాన్ ఆటగాడు 25 మ్యాచ్‌లకు గాను 23 ఇన్నింగ్స్‌లలో 95 ఫోర్లు, 12 సిక్స్‌లతో 1023 పరుగులు కొట్టాడు.
డీజే మలాన్:
18 మ్యాచ్‌లలో 995 పరుగులు కొట్టాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ మలాన్ ఈ ఏడాది 110 ఫోర్లు, 24 సిక్స్‌లు బాదాడు.
ఏకే మర్క్రం:
దక్షిణాఫ్రికాకు చెందిన మర్క్రం 21 మ్యాచ్‌లలో 97 ఫోర్లు, 29 సిక్స్‌లతో 983 పరుగులు సాధించాడు.
కేఎల్ రాహుల్:
24 మ్యాచ్‌లకుగాను 22 ఇన్నింగ్స్‌లలో 983 రన్స్ కొట్టాడు. 111 నాటౌట్ హైయెస్ట్ రన్స్. 84 ఫోర్లు, 18 సిక్స్‌లు సాధించాడు.