Yashasvi Jaiswal: విరాట్ కోహ్లీ సాధించ‌లేద‌ని జైస్వాల్ చేశాడు.. !

Published : Mar 08, 2024, 11:18 AM IST
Yashasvi Jaiswal: విరాట్ కోహ్లీ సాధించ‌లేద‌ని జైస్వాల్ చేశాడు.. !

సారాంశం

Yashasvi Jaiswal: టీమిండియా యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. టెస్టు  క్రికెట్ లో దిగ్గ‌జ ప్లేయ‌ర్ల రికార్డుల‌ను బ్రేక్ చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే విరాట్ కోహ్లీని అధిగ‌మించాడు.   

Jaiswal breaks Virat Kohli's record : ధర్మశాలలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5వ టెస్టు మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ఈ సిరీస్ లో ప‌రుగుల వ‌ర‌ద సారిస్తున్న జైస్వాల్   విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలు కూడా చేయలేని ఫీట్‌ని టెస్టుల్లో జైస్వాల్ సాధించాడు. ఒక టెస్టు సిరీస్‌లో 700 కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా యశస్వి జైస్వాల్ ఘ‌న‌త 
సాధించాడు. ఇంత‌కుముందు, భారత దిగ్గ‌జ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు జ‌రుగుతున్న భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో యశస్వి ఇప్పటివరకు 712 పరుగులు చేశాడు.

భార‌త్ తరఫున టెస్టు సిరీస్‌లో అత్యధికంగా 700+ పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్. తన కెరీర్‌లో రెండుసార్లు ఈ ఘనతను సాధించాడు. గవాస్కర్ 1971లో వెస్టిండీస్‌పై సొంత మైదానంలో 774 పరుగులు చేశాడు. 1978/79 సంవత్సరంలో, వెస్టిండీస్‌తో సొంత మైదానంలో జరిగిన టెస్టు సిరీస్‌లో గవాస్కర్ 732 పరుగులు చేశాడు. ఇప్పుడు యశస్వి జైస్వాల్ దిగ్గ‌జ ప్లేయ‌ర్ సునీల్ గవాస్కర్ క్లబ్‌లో చేరాడు. భారత్ తరఫున ఒక‌ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో విరాట్ కోహ్లీని అధిగ‌మించి సెకండ్ ప్లేస్ కు వ‌చ్చాడు. విరాట్ మూడో స్థానంలో ఉన్నాడు. 2014/15లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై 692 పరుగులు, 2016లో స్వదేశంలో ఇంగ్లండ్‌పై 655 పరుగులు చేశాడు.

YASHASVI JAISWAL: స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును బ్రేక్ చేసిన య‌శ‌స్వి జైస్వాల్.. !

భారత్ తరఫున టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయ‌ర్లు 

774 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1971
732 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1978/79
712 - యశస్వి జైస్వాల్ vs ఇంగ్లాండ్, 2024
692 - విరాట్ కోహ్లి vs ఆస్ట్రేలియా, 2014/15
655 - విరాట్ కోహ్లీ vs ఇంగ్లాండ్, 2016

టెస్టు కెరీర్ లో 1000 ప‌రుగులు పూర్తి.. 

యశస్వి జైస్వాల్ త‌న టెస్టు కెరీర్ లో 1000 ప‌రుగులు పూర్తి చేశాడు.  భార‌త్-ఇంగ్లాండ్ సిరీస్ లో ఇప్ప‌టికే రెండు డ‌బుల్ సెంచ‌రీలు బాదాడు. ధ‌ర్మ‌శాల‌లో జ‌రుగుతున్న 5వ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 58 బంతుల్లో 57 పరుగులు చేశాడు. జైస్వాల్ త‌న ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఈ క్ర‌మంలోనే ఒక ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుపై అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన స‌చిన్ టెండూల్క‌ర్ (25 సిక్స‌ర్లు) రికార్డును జైస్వాల్ (26 సిక్స‌ర్లు*) బ్రేక్ చేశాడు.

15 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్‌ క్రికెటర్‌.. !

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !