15 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్‌ క్రికెటర్‌.. !

By Mahesh RajamoniFirst Published Mar 8, 2024, 9:29 AM IST
Highlights

Noor Ali Zadran: అఫ్గానిస్థాన్ స్టార్ ప్లేయ‌ర్, వన్డే క్యాప్ నంబ‌ర్ 9 నూర్ అలీ జద్రాన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 35 ఏళ్ల ఈ ఓపెనర్ ఒక సెంచరీ, ఏడు అర్ధసెంచరీలు సాధించాడు.
 

Noor Ali Zadran: ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ప్లేయ‌ర్ నూర్ అలీ జద్రాన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. రెండు టెస్టులు, 51 వ‌న్డేలు, 23 టీ20 మ్యాచ్ లు ఆడిన త‌ర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. 2009లో ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో స్కాట్లాండ్‌తో జరిగిన ఆఫ్ఘనిస్తాన్ మొట్టమొదటి వన్డే ఇంటర్నేషనల్‌లో 28 బంతుల్లో 45 పరుగులు చేసిన జద్రాన్.. టాలరెన్స్ ఓవల్‌లో గత వారం ఐర్లాండ్‌తో తన చివరి టెస్టు ఆడాడు.

35 ఏళ్ల ఓపెనర్ త‌న కెరీర్ లో ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలతో సహా 1216 వ‌న్డే పరుగులతో రిటైర్ అయ్యాడు. అంత‌ర్జాతీయ క్రికెట్ లోకి 2010లో తన టీ20 అరంగేట్రం చేసాడు. చివరిసారిగా 2023లో టీ20 మ్యాచ్ ఆడాడు. ఇటీవ‌లే టెస్టు క్రికెట్ లో ఓపేన‌ర్ గా ఆశ్చర్యకరమైన టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, జద్రాన్‌కి అతని మేనల్లుడు, సహచరుడు ఇబ్రహీం జద్రాన్ అతని టెస్ట్ క్యాప్‌ను అందించాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 106 పరుగుల ఓపెనింగ్ స్టాండ్‌ను జోడించారు.

IND vs ENG : గిల్ మామ అదరగొట్టాడు.. క్రికెట్‌ చరిత్రలోనే సూపర్‌ క్యాచ్‌.. వీడియో

2019 వ‌న్డే ప్రపంచ కప్‌లో చివరిసారిగా ఆడిన అతను 2023 అక్టోబర్‌లో జరిగిన ఆసియా క్రీడలలో టీ20 మ్యాచ్ ల కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టులోకి వ‌చ్చాడు. ఆసియా క్రీడలలో శ్రీలంక, పాకిస్తాన్‌పై వరుసగా 51, 39 పరుగులు చేశాడు. భార‌త్ తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కావ‌డంతో ఇక్క‌డ టాప్ లో నిలిచిన భార‌త్ టోర్నీ టైటిల్ ను గెలుచుకుంది. ఏప్రిల్ 2009లో బెనోనిలో స్కాట్లాండ్‌తో తలపడిన ఆఫ్ఘనిస్తాన్ మొట్టమొదటి గుర్తింపు పొందిన వన్డే అంతర్జాతీయ జట్టులో నూర్ అలీ సభ్యుడుగా ఉన్నాడు.

ఈ మ్యాచ్ లో నూర్ అలీ ఓపెనింగ్ బ్యాటింగ్ ప్రారంభించి 28 బంతుల్లో 45 పరుగులు చేసి తన జట్టును 89 పరుగుల తేడాతో గెలిపించాడు. ఫిబ్రవరి 2010లో నూర్ మొదటి ట్వంటీ 20 ఇంటర్నేషనల్ కాగా, ఈ ఫార్మాట్‌లో ఆఫ్ఘనిస్తాన్ కు రెండవ మ్యాచ్. 2010 టీ20 ప్రపంచ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ త‌ర‌ఫున‌ భారత్‌పై హాఫ్ సెంచరీ చేయడం అతని కెరీర్ మైలురాళ్లలో ఒకటి. 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్ తొలి రౌండ్‌లో జింబాబ్వేను ఓడించిన జట్టులో కూడా నూర్ అలీ సభ్యుడుగా ఉన్నాడు.

IND vs ENG : టీమిండియా తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..

click me!