Jaiswal breaks Sachin Tendulkar's record: భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో పరుగుల వరద పారిస్తున్న టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ధర్మశాలలో జరుగుతున్న 5వ టెస్టులో కూడా మెరిశాడు. ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు.
IND vs ENG - Yashasvi Jaiswal: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టెస్టు సిరీస్ జరుగుతోంది. తొలి మ్యాచ్ లో ఓడిన భారత్ ఆ తర్వాత పుంజుకుని వరుసగా మూడు విజయాలు సాధించింది. దీంతో 5 మ్యాచ్ ల సిరీస్ ను 3-1 అధిక్యంతో గెలుచుకుంది. ఈ సిరీస్ లోని చివరిదైన 5వ మ్యాచ్ ధర్మశాల వేదికగా జరుగుతోంది. తొలి రోజు భారత్ బాల్, బ్యాట్ తో రాణించి పైచేయి సాధించింది. ఈ సిరీస్ లో పరుగుల వరద పారిస్తున్న భారత యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ధర్మశాల టెస్టులో కూడా మెరిశాడు. హాఫ్ సెంచరీ కొట్టి తన టెస్టు కెరీర్ లో 1000 పరుగులు పూర్తి చేశాడు.
తన ఇన్నింగ్స్ లలో సిక్సర్లు, ఫోర్లు కొడుతూ బౌలర్లపై విరుచుకుపడే యశస్వి జైస్వాల్ దిగ్గజ ప్లేయర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ధర్మశాల టెస్టులో 57 పరుగులు చేసిన జైస్వాల్ తన ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. దీంతో ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత క్రికెటర్ రికార్డు సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ సిక్సర్ల రికార్డును బ్రేక్ చేశాడు. గతంలో సచిన్ ఆస్ట్రేలియాపై 25 సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడు జైస్వాల్ ఇంగ్లాండ్ పై 26వ సిక్సర్లతో సచిన్ ను అధిగమించాడు. సచిన్ 74 ఇన్నింగ్స్ లలో 25 సిక్సర్లు కొట్టగా, జైస్వాల్ కేవలం 9 ఇన్నింగ్స్ ల్లోనే సాధించిడం విశేషం.
IND vs ENG : టీమిండియా తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..
ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్లు వీరే..
26* - యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్ పై 9 ఇన్నింగ్స్ లలో
25- సచిన్ టెండుల్కర్ ఆస్ట్రేలియా పై 74 ఇన్నింగ్స్ లలో
22- రోహిత్ శర్మ సౌతాఫ్రికా పై 20 ఇన్నింగ్స్ లలో
21- కపిల్ దేవ్ ఇంగ్లండ్ పై 39 ఇన్నింగ్స్ లలో
21- రిషభ్ పంత్ ఇంగ్లాండ్ పై 21 ఇన్నింగ్స్ లలో
15 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ క్రికెటర్.. !