WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ విడుదలైంది. 24 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 23 నుండి ప్రారంభమవుతుంది. ఇక ఫైనల్ మ్యాచ్ మార్చి 17న ఢిల్లీ వేదికగా జరుగునున్నది. పూర్తి షెడ్యూల్ ఇదిగో..
WPL 2024: మహిళ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2024) సీజన్-2 షెడ్యూల్ ను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) విడుదల చేసింది. ఈ టోర్నీ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 17 వరకు జరగనుంది. గతేడాది మాదిరిగానే మొత్తం ఐదు జట్లు 22 మ్యాచ్‌లు ఆడనున్నాయి. అయితే.. ఈసారి పెద్ద మార్పు కనిపించింది. గత ఏడాది ఈ లీగ్‌ను ముంబై , నవీ ముంబైలోని రెండు స్టేడియంలలో ఆడారు. అయితే.. ఈసారి ఈ లీగ్‌కు ఆతిథ్యం ముంబైకి బదులుగా బెంగళూరు, ఢిల్లీకి ఇవ్వబడింది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతాయి. రెండు మైదానాల్లో 11 మ్యాచ్‌లు జరిగాయి. బెంగళూరులో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభమవుతుంది. ఇది మహిళల ప్రీమియర్ లీగ్ రెండో ఎడిషన్ కాగా గతేడాది హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో మెగ్ లానింగ్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది.
undefined
టోర్నీలో తొలి 11 మ్యాచ్‌లు బెంగళూరులో జరగనున్నాయి. దీని తరువాత..మొత్తం ఐదు జట్లు ఢిల్లీకి వస్తాయి, అక్కడ ఎలిమినేటర్‌తో సహా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. లీగ్ రౌండ్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. కాగా, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్‌ను ఆడతాయి. 24 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో ఒక్క డబుల్ హెడర్ మ్యాచ్ కూడా జరగదు. ప్రతిరోజూ ఒక మ్యాచ్ మాత్రమే ఉంటుంది. ఎలిమినేటర్ మార్చి 15న, ఫైనల్ మార్చి 17న ఢిల్లీలో జరగనుంది.
డబ్ల్యూపీల్ షెడ్యూల్ 2024
ఫిబ్రవరి 23- ముంబయి ఇండియన్స్ vs దిల్లీ క్యాపిటల్స్ (చిన్నస్వామి స్టేడియం,బెంగళూరు)
ఫిబ్రవరి 24- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యూపీ వారియర్స్ (చిన్నస్వామి స్టేడియం- బెంగళూరు)
ఫిబ్రవరి 25- గుజరాత్ జెయింట్స్ vs ముంబయి ఇండియన్స్ (చిన్నస్వామి స్టేడియం- బెంగళూరు)
ఫిబ్రవరి 26- యూపీ వారియర్స్ vs దిల్లీ క్యాపిటల్స్ (చిన్నస్వామి స్టేడియం- బెంగళూరు)
ఫిబ్రవరి 27- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ (చిన్నస్వామి స్టేడియం- బెంగళూరు)
ఫిబ్రవరి 28- ముంబయి ఇండియన్స్ vs యూపీ వారియర్స్ (చిన్నస్వామి స్టేడియం- బెంగళూరు)
ఫిబ్రవరి 29- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs దిల్లీ క్యాపిటల్స్ (చిన్నస్వామి స్టేడియం- బెంగళూరు)
మార్చి 1- యూపీ వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్ (చిన్నస్వామి స్టేడియం- బెంగళూరు)
మార్చి 2- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబయి ఇండియన్స్ (చిన్నస్వామి స్టేడియం- బెంగళూరు)
మార్చి 3- గుజరాత్ జెయింట్స్ vs దిల్లీ క్యాపిటల్స్ (చిన్నస్వామి స్టేడియం- బెంగళూరు)
మార్చి 4- యూపీ వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (చిన్నస్వామి స్టేడియం- బెంగళూరు)
మార్చి 5- దిల్లీ క్యాపిటల్స్ vs ముంబయి ఇండియన్స్ (అరుణ్ జెటలీ స్టేడియం- దిల్లీ)
మార్చి 6- గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (అరుణ్ జెటలీ స్టేడియం-దిల్లీ)
మార్చి 7- యూపీ వారియర్స్ vs ముంబయి ఇండియన్స్ (అరుణ్ జెటలీ స్టేడియం-దిల్లీ)
మార్చి 8- దిల్లీ క్యాపిటల్స్ vs యూపీ వారియర్స్ (అరుణ్ జెటలీ స్టేడియం- దిల్లీ)
మార్చి 9- ముంబయి ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ (అరుణ్ జెటలీ స్టేడియం-దిల్లీ)
మార్చి 10- దిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (అరుణ్ జెటలీ స్టేడియం-దిల్లీ)
మార్చి 11- గుజరాత్ జెయింట్స్ vs యూపీ వారియర్స్ (అరుణ్ జెటలీ స్టేడియం-దిల్లీ)
మార్చి 12- ముంబయి ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (అరుణ్ జెటలీ స్టేడియం-దిల్లీ)
మార్చి 13- దిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (అరుణ్ జెటలీ స్టేడియం-దిల్లీ)
మార్చి 15- ఎలిమినేటర్ (అరుణ్ జెటలీ స్టేడియం-దిల్లీ)
మార్చి 17- ఫైనల్ (అరుణ్ జెటలీ స్టేడియం-దిల్లీ)
WPLలో తలపడే జట్టు ఇవే..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)
గుజరాత్ జెయింట్స్ (GG)
ముంబై ఇండియన్స్ (MI)
ఢిల్లీ క్యాపిటల్స్ (DC)
UP వారియర్స్ (UPW)