ఆర్సీబీకి అదృష్టం కలిసొచ్చేనా..? యూపీతో కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన మంధాన

Published : Mar 10, 2023, 07:03 PM ISTUpdated : Mar 10, 2023, 07:09 PM IST
ఆర్సీబీకి అదృష్టం కలిసొచ్చేనా..?  యూపీతో  కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన మంధాన

సారాంశం

WPL: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో  నేడు  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  తమ నాలుగో మ్యాచ్  లో యూపీ వారియర్స్ ను ఢీకొంటుంది.  వరుసగా హ్యాట్రిక్ ఓటముల తర్వాతైనా ఆ జట్టు బోణీ కొడుతుందా...? 

జట్టులో అంతర్జాతీయ స్థాయి బ్యాటర్లు, భీకర బౌలర్లు,  అదరగొట్టే ఆల్ రౌండర్లున్నారు. సొగసైన ఆటతో  మరిపించే ప్లేయర్లతో పాటు  సోయగాలతో మైమరిపించే ముద్దుగుమ్మలూ ఉన్నారు. ఆ టీమ్ కు కావాల్సినంత క్రేజ్ ఉంది. డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఆ ఫ్రాంచైజీ సొంతం. అయినా అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా తయారైంది  ఆ జట్టు పరిస్థితి.  లీగ్ మొదలై వారం గడుస్తున్నా ఇంతవరకు  ఆడిన మూడు మ్యాచ్ లలోనూ  ఆర్సీబీని ఓటములే వెంటాడుతున్నాయి.  ఈ నేపథ్యంలో నేడు యూపీ వారియర్స్ తో ఆడుతున్న  మ్యాచ్ ఆ జట్టుకు చాలా కీలకం.  

ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం వేదికగా  యూపీ వారియర్స్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో  ఆర్సీబీ.. తొలుత టాస్  గెలిచి తొలుత బ్యాటింగ్ కు రానుంది. యూపీ బౌలింగ్ చేయనుంది.  హ్యాట్రిక్ ఓటముల తర్వాత అయినా విజయబోణీ కొట్టాలని మంధాన అండ్ కో. ఆశలు పెట్టుకుంది. 

ఆర్సీబీ ఆడిన మూడు మ్యాచ్ లు బ్రబోర్న్ స్టేడియంలోనే. మూడింట్లోనూ ఆ జట్టును పరాజయాలే పలకరించాయి.  మరి నేడు  యూపీతో జరుగుతున్న నేటి మ్యాచ్ లో  బెంగళూరు అమ్మాయిలు ఏం చేస్తారో మరి..?  

ఈ సీజన్ లో ఆర్సీబీ  తరఫున  మంధాన బ్యాటింగ్ లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోతోంది. గుజరాత్ తో  గత మ్యాచ్ లో విజయానికి దగ్గరగా వచ్చినా   11 పరుగుల తేడాతో ఓడింది.   ఓపెనర్ సోఫీ డివైన్  కాస్త మెరుగ్గా ఆడుతున్నా ఆమె ప్రదర్శనలు విజయాలను అందివ్వలేకపోతున్నాయి. ఆల్ రౌండర్ల కోటాలో ఎలీస్ పెర్రీ అటు బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా విఫలమవుతోంది. హెదర్ నైట్  ఫర్వాలేదనిపిస్తున్నా చివర్లో ఆమెకు సహకరించేవారు కరువవుతున్నారు.  బౌలర్లలో మేగన్ షుట్, రేణుకా సింగ్ ఠాకూర్ లు దారుణంగా విఫలమవుతున్నారు.  

ఇక తొలి మ్యాచ్ లో గుజరాత్ ను  ఓడించిన  యూపీ.. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ తో మాత్రం  బోల్తా కొట్టింది.  కెప్టెన్ అలీస్సా హీలి  నుంచి ఆ జట్టు మంచి ఆరంభాలను కోరుకుంటోంది.   భారత్ తరఫున అండర్-19 వరల్డ్ కప్ లో రాణించిన శ్వేతా  సెహ్రావత్  విఫలమవుతోంది. కిరణ్ నవ్‌గిరె తొలి మ్యాచ్ లో రాణించినా తర్వాత మ్యాచ్ లో  నిరాశపరిచింది.  గత మ్యాచ్ లో తహిలా మెక్‌గ్రాత్  సెంచరీ సమీపానికి వచ్చినా ఆమె మ్యాచ్ ను గెలిపించలేకపోయింది.   దీప్తి శర్మ  స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. 

తుది జట్లు :  ఈ మ్యాచ్ కోసం  ఆర్సీబీ మూడు  మార్పులతో బరిలోకి దిగుతోంది.  యూపీ కూడా ఒక మార్పు  చేసింది. 

యూపీ వారియర్స్ : అలీస్సా హీలి (కెప్టెన్), శ్వేతా సెహ్రావత్, కిరణ్ నవ్‌గిరె, తహిలా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, దేవికా వైద్య, సిమ్రాన్ షేక్, సోఫీ ఎక్లిస్టోన్, గ్రేస్ హరీస్, అంజలి సర్వణి, రాజేశ్వరి గైక్వాడ్ 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎలీస్ పెర్రీ, రిచా ఘోష్, హెదర్  నైట్, కనికా అహుజా,  శ్రేయాంక పాటిల్, రేణుకా సింగ్ ఠాకూర్, ఎరిన్ బర్న్స్, సహనా పవార్, కొమల్ జంజద్

 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?