
మహిళల ప్రీమియర్ లీగ్ లో ఆదివారం డబుల్ హెడర్ క్రికెట్ ప్రేమికులను అలరిస్తున్నది. నేడు మధ్యాహ్నం ఆర్సీబీ - ఢిల్లీ మధ్య మ్యాచ్ జరుగగా ఇప్పుడు యూపీ వారియర్స్ - గుజరాత్ జెయింట్స్ మధ్య మరో మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. నిన్న ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో భారీ తేడాతో ఓటమి పాలైన గుజరాత్.. నేడైనా తొలి బోణీ కొడుతుందేమో వేచి చూడాలి. కాగా నేటి మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. యూపీ వారియర్స్ మొదట ఫీల్డింగ్ కు రానుంది.
డీవై పాటిల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ సారథి బెత్ మూనీ ఆడటం లేదు. ముంబైతో మ్యాచ్ లో ఆమె గాయపడింది. మూనీతో పాటు మరో ఇద్దరు ప్లేయర్లను కూడా మార్చింది గుజరాత్. మూనీ స్థానంలో భారత ఆల్ రౌండర్ స్నేహ్ రాణా సారథ్య బాధ్యతలు మోయనుంది.
గత మ్యాచ్ లో ఆడిన గుజరాత్ టీమ్ లో మూడు మార్పులు జరిగాయి. సోఫీ డంక్లీ, మోనికా, కిమ్ గార్త్ లు తుది జట్టులోకి వచ్చారు.
తుది జట్లు:
గుజరాత్ : సబ్బినేని మేఘన, హర్లీన్ డియోల్, ఆష్లే గార్డ్‌నర్, సోఫీ డంక్లీ, అన్నాబెల్ సదర్లాండ్, కిమ్ గార్త్, సుష్మా వర్మ, దయాలన్ హేమలత, స్నేహ్ రాణా (కెప్టెన్), తనూజా కన్వర్, మాన్సి జోషి
యూపీ వారియర్స్ : అలీస్సా హీలి (కెప్టెన్), శ్వేతా సెహ్రావత్, తహిలా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, గ్రేస్ హరీస్, సిమ్రాన్ షేక్, కిరణ్ నవ్గిరె, దేవికా వైద్య, సోఫీ ఎక్లిస్టోన్, అంజలి సర్వని, రాజేశ్వరి గైక్వాడ్