మెల్‌బోర్న్ కన్నా పెద్ద క్రికెట్ స్టేడియం ఇండియాలోనే: ఎక్కడంటే..?

By Siva KodatiFirst Published Dec 13, 2019, 4:08 PM IST
Highlights

సుమారు రూ. 700 కోట్ల వ్యయంతో లక్షా 10 వేల సీటింగ్ కెపాసిటీతో నిర్మించిన కొత్త క్రికెట్ స్టేడియం పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంది

ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏది..? ఏ దేశంలో ఉంది అని మనం చిన్నప్పుడు జీకేలో చదువుకుని ఉంటాం. దీనికి సమాధానం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్.. అయితే ఇక నుంచి ఇది గతం మాత్రమే. ఇప్పటి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం భారతదేశంలోని అహ్మదాబాద్‌ అని జావాబు చెప్పాల్సి ఉంటుంది.

అవును మీరు వింటున్నది నిజమే. సుమారు రూ. 700 కోట్ల వ్యయంతో లక్షా 10 వేల సీటింగ్ కెపాసిటీతో నిర్మించిన కొత్త క్రికెట్ స్టేడియం పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఈ గ్రౌండ్‌లో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.

Also Read:బాలీవుడ్ బ్యూటీతో పంత్ డేటింగ్..? మరి ఆ లవ్ ఏమైంది?

2017లో ఇదే స్థానంలో ఉన్న సర్దార్ వల్లభభాయ్ పటేల్ స్టేడియంను పూర్తిగా తొలగించి దాని స్థానంలో ఈ స్టేడియంను నిర్మించే పనులను ప్రారంభించారు. దీని నిర్మాణానికి మూడేళ్ల సమయం పట్టింది.

ఇందులో 70 కార్పోరేట్ బాక్స్‌లు, నాలుగు డ్రెస్సింగ్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. స్టేడియంలోని మరో ప్రాంతంలో ఒలింపిక్స్ సైజ్ స్మిమ్మింగ్ ‌పూల్‌ను నిర్మించారు. 2020 జనవరిలో ఆసియా ఎలెవన్-వరల్డ్ ఎలెవన్ మ్యాచ్‌ను ఈ స్టేడియంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read:నేను అవుట్ కాదు.. క్రీజు వదలని యూసూఫ్ పఠాన్.. వివాదం

ఇంతకు ముందు మనదేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా కోల్‌కోతాలోని ఈడెన్ గార్డెన్స్ ఉండేది. దీని సిటింగ్ కెపాసిటీ లక్ష.. అయితే ప్రధాన బిల్డింగ్‌ని పున: నిర్మించే క్రమంలో దీనిని 66 వేలకు తగ్గించారు. ఇదే సమయంలో మెల్‌బోర్న్‌ క్రికెట్ స్టేడియం కెపాసిటీ లక్ష. 

click me!