WTC final:అలా చేసుకుంటే ఇంగ్లాండ్ గెలిచేది.. మైకేల్ వాన్

Published : Jun 23, 2021, 10:41 AM IST
WTC final:అలా చేసుకుంటే ఇంగ్లాండ్ గెలిచేది.. మైకేల్ వాన్

సారాంశం

ఈ మ్యాచ్ పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. టీమిండియాపై ఆయన వేసిన కౌంటర్ పై ఇండియన్స్ మండిపడుతున్నారు. ఆయనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కి వరుణుడు ఆటంకం కలిగిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే ఈ వర్షం కారణంగా రెండు రోజుల మ్యాచ్ లు రద్దు అయిపోయాయి. ఐదో రోజు మ్యాచ్ ఈ రోజు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కూడా వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది.  కాగా... వర్షం కారణంగా మ్యాచ్ ఇలా అయిపోవడంపై ఇప్పటికే నెట్టింట మీమ్స్ పుట్టుకొస్తున్నాయి. 

కాగా.. తాజాగా.. ఈ మ్యాచ్ పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. టీమిండియాపై ఆయన వేసిన కౌంటర్ పై ఇండియన్స్ మండిపడుతున్నారు. ఆయనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

‘‘ఈ ప్రపంచ ఛాంపియన్ షిప్ నార్త్ ప్లేస్ నిర్వహించి ఉంటే... ఈ పాటికి ఇంగ్లాండ్ విజేతగా నిలిచేది. ఒక్క నిమిషం కూడా ఆటను మిస్ అయ్యేవారు కాదు’’ మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు. 

అంతే.. ఇక ఇండియన్స్ ఆయన ట్వీట్ పై మండిపడ్డారు. దారుణంగా విమర్శించడం మొదలుపెట్టారు. ఆయన చేసిన ట్వీట్ పట్ల ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ ని కూడా తిట్టడం గమనార్హం. ఇన్ని సార్లు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ కి వెళ్లినా.. ఫైనల్ కి చేరలేదంటూ కొందరు తిట్టడం గమనార్హం.

 

PREV
click me!

Recommended Stories

Joe Root : సచిన్ సాధించలేని రికార్డులు.. జో రూట్ అదరగొట్టాడు !
సింహం ఒక్క అడుగు వెనక్కి.. కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్ ఆడతానన్నది ఇందుకేనా.?