WTC final: నేడు ఆరో రోజూ ఆట, రిజర్వ్ డే అంటే ఏమిటి?

By telugu teamFirst Published Jun 23, 2021, 8:14 AM IST
Highlights

న్యూజిలాండ్, భారత్ మధ్య జరుగుతున్న ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఈ రోజు కూడా జరుగతుంది. ఐసీసీ ప్రకటించిన రిజర్వ్ డే కారణంగా మ్యాచ్ ను ఆరో రోజుకు పొడగించారు.

సౌతాంప్టన్: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐసీసీ ప్రపంచ్ కప్ టెస్ట్ ఫైనల్ మ్యాచ్ ఆరో రోజూ కూడా జరగనుంది. ఫైనల్  మ్యాచ్ మొదటి రోజు, నాలుగో రోజు ఆట జరగలేదు. మిగతా రోజుల్లో వెలుతురు సరిగా లేకపోవడంతో పూర్తి స్థాయిలో జరగలేదు. ఈ స్థితిలో మ్యాచ్ ను ఆరో రోజుకు పొడగించారు. 

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2021 ఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డేను వాడుకోవచ్చునని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. దాంతో జూన్ 23వ తేదీ రిజర్వ్ డేగా ప్రకటించారు. దీంతో ఈ రోజు ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

2018 ఐసీసీ ప్రపంచకప్ కు ముందు అదనపు రోజును అందుబాటులోకి తెచ్చారు. దీంతో న్యూజిలాండ్, భారత్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ ఆరో రోజు జరుగుతోంది. ఈ రోజు ఆట భారత కాలమానం ప్రకారం సాయంత్రం 3 గంటలకు ప్రారంభమవుతుంది. 98 ఓవర్ల ఆట కొనసాగుతుంది. చివరి గంట ఆటపై అంపైర్లు నిర్ణయం తీసుకుంటారు. 

రిజర్వ్ డేనాడు గరిష్టంగా 330 నిమిషాలు జరుగుతుంది. 83 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ఏది ముందు అయితే అది అమలవుతుంది. చివరి గంట మ్యాచ్ కు అంపైర్లు సిగ్నల్ ఇస్తారు. 

రిజర్వ్ డే ఆట కోసం టికెట్లను తక్కువ ధరకు విక్రయించాల్సి ఉంటుంది. మొదటి రోజు, నాలుగో రోజు టికెట్లు కొన్నవారికి ముందు ప్రాధాన్యం ఇస్తారు. రిజర్వ్ డే కూడా కోవిడ్ నిబంధనల వర్తిస్తాయి. 

మ్యాచ్ డ్రా అయినా, టై అయినా ఇరు జట్లను విజేతలుగా ప్రకటిస్తారని ఐసీసీ తెలిపింది. భారత్ రెండో ఇన్నింగ్సులో నిన్న ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్సులో న్యూజిలాండ్ 249 పరుగులకు ఆలవుట్ అయింది. తొలి ఇన్నింగ్సులో భారత్ 217 పరుగులు చేసింది.  

click me!