Women's Ashes 2023: రసవత్తరంగా ఉమెన్స్ యాషెస్.. ఇరు జట్లకూ విజయావకాశాలు

Published : Jun 26, 2023, 01:58 PM ISTUpdated : Jun 26, 2023, 01:59 PM IST
Women's Ashes 2023: రసవత్తరంగా ఉమెన్స్ యాషెస్.. ఇరు జట్లకూ విజయావకాశాలు

సారాంశం

Women's Ashes 2023: మహిళల యాషెస్ లో ఆస్ట్రేలియా విజయం దిశగా దూసుకుపోతుంది. ఇంగ్లాండ్ కు కూడా విజయావకాశాలు ఉన్నాయి.  నేడు ఫలితం తేలనుంది. 

ఇటీవలే  బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య చివరి ఓవర్  వరకూ ఉత్కంఠభరితంగా సాగిన  పురుషుల యాషెస్  లో కంగారూలు అత్యద్భుత పోరాటంతో సూపర్ డూపర్ విక్టరీ కొట్టారు.  తాజాగా మహిళల యాషెస్ లో కూడా ఆస్ట్రేలియా విజయం దిశగా దూసుకుపోతుంది. అయితే ఇంగ్లాండ్ కు కూడా విజయావకాశాలు ఉన్నాయి.  

నాటింగ్‌హోమ్ (ట్రెంట్‌ బ్రిడ్జ్) వేదికగా   జరుగుతున్న ఏకైక టెస్టులో  భాగంగా  ఆస్ట్రేలియా నిర్దేశించిన 268 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి  ఐదు వికెట్లు కోల్పోయి  116 పరుగులు చేసింది. ఆట ఆఖరి రోజు ఇంగ్లాండ్ విజయానికి  152 పరుగులు అవసరం కాగా  ఆసీస్ కు ఐదు వికెట్లు కావాలి.  

తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్.. 473 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. సదర్లండ్ (137)   సెంచరీతో రాణించగా..  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ తరఫున ఆడే ఎల్లీస్ పెర్రీ  (99) తృటిలో సెంచరీ కోల్పోయింది.  తహిళ మెక్‌గ్రాత్ (61)  రాణించింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 463 పరుగులు చేసింది.   ఓపెనర్ బ్యూమంట్  (208) డబుల్ సెంచరీతో ఆకట్టుకుంది. సీవర్  (78), హెథర్ నైట్ (57)  కూడా హాఫ్ సెంచరీ చేసింది. 

ఆస్ట్రేలియా  రెండో ఇన్నింగ్స్ లో 257 పరుగులకే ఆలౌట్ అయింది.  ఇంగ్లాండ్ స్పిన్నర్ సోఫీ ఎకిల్‌స్టోన్ ఐదు వికెట్లు పడగొట్టింది.  బెత్ మూనీ (85) టాప్ స్కోరర్.  తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని  ఇంగ్లాండ్ ఎదుట 268 పరుగుల లక్ష్యం పెట్టింది ఆసీస్. మూడో సెషన్ లో బ్యాటింగ్ కు వచ్చిన  ఇంగ్లాండ్ బాగానే ఆడింది.  ఓపెనర్లు ఎమ్మా లంబ్ (28), టామీ బ్యూయంట్ (22) తొలి వికెట్ కు  55 పరుగులు జోడించారు.  కానీ ఆసీస్ స్పిన్నర్ ఆష్లే గార్డ్‌నర్.. వరుస ఓవర్లలో  బ్యూమంట్, నైట్ (9), సీవర్ (0) ను ఔట్ చేయడంతో ఇంగ్లాండ్  కష్టాల్లో పడింది.   కిమ్ గార్త్, తహిళా మెక్‌గ్రాత్ కూడా తలా ఓ వికెట్ తీయడంతో  ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఐదు వికెట్లు కోల్పోయింది.   ప్రస్తుతం క్రీజులో  డేనియల్  వ్యాట్  (20 నాటౌట్), కేట్ క్రాస్ (5 నాటౌట్) క్రీజులో ఉన్నారు.  

PREV
click me!

Recommended Stories

Abhishek Sharma Vs Chris Gayle : అసలైన బాస్ ఎవరో తేలిపోయింది.. 36 మ్యాచ్‌ల్లోనే షాకింగ్ రికార్డ్
Team India : టీమిండియాలో కీలక మార్పులు.. న్యూజిలాండ్ సిరీస్‌కు తిలక్ వర్మ దూరం