వుమెన్స్ టీ20 ఛాలెంజ్: వాళ్ల కంటే వీళ్లే బెటర్... ఆఖర్లో కుప్పకూలిన సూపర్ నోవాస్...

Published : May 23, 2022, 09:13 PM IST
వుమెన్స్ టీ20 ఛాలెంజ్: వాళ్ల కంటే వీళ్లే బెటర్... ఆఖర్లో కుప్పకూలిన సూపర్ నోవాస్...

సారాంశం

Women T20 Challenge: 35 పరుగులు చేసిన హర్లీన్ డియోల్..  హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్... ఆఖరి 9 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయిన సూపర్ నోవాస్... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో లీగ్ మ్యాచులు ముగియడంతో నేడు బ్రేక్ డే. 58 రోజుల పాటు ప్రతీరోజూ మ్యాచులతో సాగిన ఐపీఎల్ 2022 సీజన్‌కి నేడు బ్రేక్ దొరకకగా ఈ గ్యాప్‌లో వుమెన్స్ టీ20 ఛాలెంజ్‌ మొదలైపోయింది. వుమెన్స్ టీ20 ఛాలెంజ్ 2022 టోర్నీలో భాగంగా నేడు మొదటి మ్యాచ్‌లో సూపర్ నోవాస్, ట్రైయిల్‌బ్లేజర్స్‌‌తో తలబడుతోంది...

హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని సూపర్ నోవాస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది సూపర్ నోవాస్... వుమెన్స్ టీ20 ఛాలెంజ్‌ టోర్నీలో ఇదే అత్యధిక స్కోరు.  మొదటి ఓవర్ నుంచే దూసుకు కొనసాగించారు ఓపెనర్లు. 17 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసిన డియాండ్రా డాటిన్ రనౌట్ కావడంతో 50 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది సూపర్ నోవాస్...

20 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన ప్రియా పూనియా, హేలీ మాథ్యూస్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కాగా... 19 బంతుల్లో 5 ఫోర్లతో 35 పరుగులు చేసిన హర్లీన్ డియోల్, సల్మా ఖటూన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరింది...

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 29 బంతుల్లో 4 ఫోర్లతో 37 పరుగులు చేసి రనౌట్ కాగా సునీ లూజ్ 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసింది. అలెనా కింగ్ 5 పరుగులు చేసి అవుట్ కాగా పూజా వస్త్రాకర్ 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 14 పరుగులు చేసింది...

ఆఖరి ఓవర్‌లో సోఫీ ఎక్లే‌స్టోన్‌ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన హేలీ మాథ్యూస్, వీ చందూనీ కూడా ఆఖరి బంతికి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చింది. మేఘనా సింగ్‌ రనౌట్ రూపంలో పెవిలియన్ చేరింది. 

18.3 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసిన సూపర్ నోవాస్, ఆఖరి 9 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి 8 పరుగులు మాత్రమే చేయగలిగింది.. ఆఖరి 5 ఓవర్లలో 40 పరుగులు రాగా 6 వికెట్లు కోల్పోయింది హర్మన్‌ప్రీత్ టీమ్... 

ట్రైయిల్ బ్లేజర్స్ టీమ్ బౌలర్లలో హేలీ మాథ్యూస్‌కి మూడు వికెట్లు దక్కగా సల్మా ఖటూన్ రెండు వికెట్లు తీసింది. పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ చెరో వికెట్ తీశారు. ట్రైయిల్ బ్లేజర్స్ టీమ్‌లో ఒక్క బౌలర్ కూడా ఎక్స్‌ట్రాల రూపంలో ఒక్క పరుగు కూడా ఇవ్వకపోవడం విశేషం. వైడ్ రూపంలో కానీ, నో బాల్‌ రూపంలో కానీ ఆఖరికి లెగ్ బైస్ రూపంలో కూడా అదనపు పరుగు సూపర్ నోవాస్ జట్టు స్కోరులో చేరకపోవడం విశేషం... 

 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !