రిషబ్ పంత్‌ని మోసం చేసిన క్రికెటర్ అరెస్ట్... ఖరీదైన వాచీలను అమ్మిపెడతానని చెప్పి...

By Chinthakindhi RamuFirst Published May 23, 2022, 8:01 PM IST
Highlights

రిషబ్ పంత్‌ని, ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజర్ పునీత్ సోలంకిని మోసం చేసిన హర్యానా క్రికెటర్ మ్రినాక్ సింగ్... ఖరీదైన వాచీలు అమ్మిపెడతానని ఆశ చూపి, లక్షల సొత్తు కాజేసి... 

భారత యంగ్ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ క్రీజులో ఎంత దూకుడుగా వ్యవహరిస్తాడో, బయట కూడా అలాంటి దూకుడు చూపించి... ఓ వ్యక్తి చేతుల్లో దారుణంగా మోసపోయాడు. హర్యానాకి చెందిన క్రికెటర్ మ్రినాంక్ సింగ్... ఖరీదైన వాచీలను, మొబైల్ ఫోన్లను తక్కువ ధరకి ఇప్పిస్తానని ఆశ చూపించి... ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ దగ్గర్నుంచి లక్షల విలువైన సొత్తును తీసుకుని పరారయ్యాడు...

రిషబ్ పంత్‌కి ఖరీదైన వాచీలకు బాగా ఇష్టం. ఫ్రాంక్ ముల్లర్ వాన్‌గార్డ్ యాచ్‌కింగ్ సిరీస్‌కి చెందిన వాచీని కొనుగోలు చేసేందుకు రూ.36 లక్షల 25 వేల 120 చెల్లించాడు. అలాగే మరో క్రేజీ కలర్ రిచర్డ్ మిల్లే వాచీ కోసం మరో రూ.62 లక్షల 60 వేలను వెచ్చించి కొనుగోలు చేశాడు...

అయితే వాచీలు తిరిగి అమ్మిబెడతానని నమ్మించి, వాటిని తీసుకుని,బోగస్ చెక్‌తో మోసం చేశాడని పసిగట్టిన రిషబ్ పంత్, మ్రినాంక్ సింగ్‌పై కేసు పెట్టాడు... పోలీసులు చెప్పిన కథనం ప్రకారం... ‘జనవరి 2021లో మ్రినాంక్ సింగ్, రిషబ్ పంత్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజర్ పునీత్ సోలంకిని కలిసాడు. తాను ఓ కొత్త వ్యాపారం మొదలెట్టానని ఖరీదైన లగ్జరీ వాచీలు, బ్యాగులు, జ్యూవెలరీని కొనుగోలు చేసి వాటిని విక్రయిస్తుంటానని నమ్మబలికాడు. తాను చాలామంది క్రికెటర్లకు ఇలా వాచీలు అమ్మినట్టు రిఫరెన్సులు చూపించాడు... 

పాత వాచీలు ఎక్కవ ధరకు అమ్మిబెట్టి, తక్కువ ధరకు వాచీలు ఇప్పిస్తానని మ్రినాంక్ సింగ్ చెప్పిన మాటలను నమ్మిన రిషబ్ పంత్, సోలంకి... అతనికి ఓ ఖరీదైన వాచీ, కొన్ని బంగారు జ్యూవెలరీని అందించారు. వీటి విలువ కోటి రూపాయలకు పైనే ఉంటుంది. ఫిబ్రవరిలో వాటిని రిషబ్ పంత్ నుంచి రీసేల్ కోసం కొనుగోలు చేసినట్టుగా రూ.కోటీ 63 లక్షల 70 వేల 731 లకు చెక్కు ఇచ్చాడు మ్రినాంక్ సింగ్. అయితే అది బౌన్స్ కావడంతోమ్రినాంక్‌ క్‌పై కేసు పెట్టాడు రిషబ్ పంత్...’

ఈ కేసుపై ఏడాదికి పైగా విచారణ జరగగా గత వారం ముంబైలోని అర్థర్ రోడ్ జైలు, మ్రినాంక్  సింగ్‌ని కోర్టులో హాజరుపరచాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. అతన్ని అరెస్టు చేసిన జుహు పోలీసులు, అతని దగ్గర నుంచి రూ.6 లక్షల నగదు వసూలు చేశారు...

తనని తాను బిజినెస్‌మ్యాన్‌ని పరిచయం చేసుకుంటున్న మ్రినాంక్ సింగ్ చేతుల్లో చాలామంది సెలబ్రిటీలు, బడా బాబులు, క్రికెటర్లు కూడా మోసపోయి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు... 

click me!