వుమెన్స్ టీ20 ఛాలెంజ్: హర్మన్‌ప్రీత్ సూపర్ హాఫ్ సెంచరీ... వెలాసిటీ ముందు..

Published : May 24, 2022, 05:09 PM ISTUpdated : May 24, 2022, 05:18 PM IST
వుమెన్స్ టీ20 ఛాలెంజ్: హర్మన్‌ప్రీత్ సూపర్ హాఫ్ సెంచరీ... వెలాసిటీ ముందు..

సారాంశం

టాస్ గెలిచి సూపర్ నోవాస్‌కి బ్యాటింగ్ అప్పగించిన వెలాసిటీ... 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సూపర్ నోవాస్‌ని ఆదుకున్న తానియా, హర్మన్‌ప్రీత్ కౌర్... 

వుమెన్స్ టీ20 ఛాలెంజ్ 2022 టోర్నీలో భాగంగా నేడు సూపర్ నోవాస్ జట్టు, వెలాసిటీతో తలబడుతోంది. నిన్న జరిగిన మొదటి మ్యాచ్‌లో ట్రైయిల్‌బ్లేజర్స్‌పై సూపర్ విజయాన్ని అందుకుని బోణీ కొట్టిన సూపర్ నోవాస్, నేటి మ్యాచ్ గెలిచి ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకోవాలని చూస్తోంది....


టాస్ గెలిచిన వెలాసిటీ కెప్టెన్ దీప్తి శర్మ, సూపర్ నోవాస్‌కి బ్యాటింగ్ అప్పగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ నోవాస్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది... ప్రియా పూనియా 4, డియాండ్రా డాటిన్ 6, హర్లీన్ డియోల్ 7 పరుగులు చేసి అవుట్ కావడంతో 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది సూపర్ నోవాస్...

అయితే వికెట్ కీపర్ తానియా భాటియాతో కలిసి నాలుగో వికెట్‌కి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకుంది సూపర్ నోవాస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్. 32 బంతుల్లో 3 ఫోర్లతో 36 పరుగులు చేసిన తానియా భాటియా రనౌట్ కాగా... హర్మన్‌ప్రీత్ కౌర్ 51 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 71 పరుగులు చేసి రాధా యాదవ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యింది...

సునీ లూజ్ 14 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేయగా పూజా వస్త్రాకర్ 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. వెలాసిటీ టీమ్ బౌలర్లలో కేట్ క్రాస్‌ 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు దక్కగా కెప్టెన్ దీప్తి శర్మ, రాధా యాదవ్ చెరో వికెట్ తీశారు.  

టీమిండియా వుమెన్స్ వన్డే, టెస్టు కెప్టెన్ మిథాలీ రాజ్, గత సీజన్లలో వెలాసిటీ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించింది. అయితే ఈసారి ఆమె వుమెన్స్ టీ20 ఛాలెంజ్ నుంచి బ్రేక్ తీసుకోవడంతో వెలాసిటీకి కెెప్టెన్‌గా దీప్తి శర్మకు అవకాశం దక్కింది. గత సీజన్‌లో ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయిన వెలాసిటీ, ఈసారి ఎలాగైనా ఫైనల్ చేరి మొట్టమొదటి వుమెన్స్ టీ20 ఛాలెంజ్ టైటిల్ దక్కించుకోవాలని చూస్తోంది...

వచ్చే ఏడాది వుమెన్స్ ఐపీఎల్ మొదలుకాబోతున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. దీంతో వుమెన్స్ టీ20 ఛాలెంజ్‌కి ఇది ఆఖరి సీజన్ కావచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటిదాకా మూడు సీజన్లు జరగగా హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని సూపర్ నోవాస్ రెండు సార్లు టైటిల్ సాధించగా 2020 సీజన్‌లో యూఏఈలో జరిగిన వుమెన్స్ టీ20 ఛాలెంజ్ టోర్నీలో స్మృతి మంధాన కెప్టెన్సీలోని ట్రైయిల్‌బ్లేజర్స్, సూపర్ నోవాస్‌ని ఫైనల్‌లో ఓడించి మొట్టమొదటి టైటిల్ గెలిచింది... గత ఏడాది కరోనా సెకండ్ వేవ్ కారణంగా వుమెన్స్ టీ20 ఛాలెంజ్ టోర్నీని నిర్వహించలేదు బీసీసీఐ... 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?