SLO vs VEL: షఫాలీ దూకుడు.. లారా దంచుడు.. వెలోసిటీదే విజయం..

Published : May 24, 2022, 06:49 PM ISTUpdated : May 24, 2022, 06:50 PM IST
SLO vs VEL: షఫాలీ దూకుడు.. లారా దంచుడు.. వెలోసిటీదే విజయం..

సారాంశం

Women's T20 Challenge 2022: మహారాష్ట్రలోని పూణే వేదికగా జరుగుతున్న ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ లో  తొలి మ్యాచ్ ఆడుతున్న వెలోసిటీ విజయంతో బోణీ కొట్టింది.  సోమవారం ట్రైయల్ బ్లేజర్స్ ను ఓడించిన సూపర్ నోవాస్.. నేటి పోరులో తడబడింది. 

ఉమెన్స్ టీ20 ఛాలెంజ్-2022 లో భాగంగా సూపర్ నోవాస్-వెలోసిటీ మధ్యలో జరిగిన మొదటి మ్యాచ్ లో దీప్తి శర్మ సారథ్యంలోని వెలోసిటీనే విజయం వరించింది. సూపర్ నోవాస్ నిర్దేశించిన  151 పరుగుల లక్ష్యాన్ని వెలోసిటి.. 3 వికెట్లు మాత్రమే కోల్పోయి  మరో పది బంతులు మిగిలుండగానే ఛేదించింది.  తొలి మ్యాచ్ లో ట్రైయల్ బ్లేజర్స్ ను ఓడించి బోణీ కొట్టిన  సూపర్ నోవాస్  నేటి మ్యాచ్ లో పరాజయం చవిచూడాల్సి వచ్చింది. 

151 పరుగుల లక్ష్య ఛేదనలో  వెలోసిటీ జట్టుకు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ నత్కన్ చంతమ్.. ఒక్క పరుగుకే వెనుదిరిగింది. కానీ లేడీ సెహ్వాగ్ గా పేరొందిన మరో ఓపెనర్ షఫాలీ వర్మ (33 బంతుల్లో 51.. 9 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగి ఆడింది.

ఆది నుంచి దూకుడుగానే ఆడిన షఫాలీ.. ఫోర్లతో సూపర్ నోవాస్ బౌలర్లపై విరుచుకుపడింది.  వికెట్ కీపర్ బ్యాటర్ యస్తిక భాటియా (17) తో కలిసి రెండో వికెట్ కు 63 పరుగులు జోడించింది. 8వ ఓవర్లో భాటియా ఔటైనా షఫాలీ దూకుడు తగ్గలేదు. అదే క్రమంలో అలన కింగ్ వేసిన 9వ ఓవర్లో  మూడో బంతికి సింగిల్ తీసి హాఫ్   సెంచరీ సాధించింది. 30 బంతుల్లోనే ఆమె ఫిఫ్టీ పూర్తి చేయడం గమనార్హం. ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ లో ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. 

 

హాఫ్ సెంచరీ అయ్యాక షఫాలీ.. పదో ఓవర్లో డాటిన్ వేసిన నాలుగో బంతికి  హర్మన్ ప్రీత్ కౌర్ కు క్యాచ్ ఇచ్చి  ఔటైంది. అప్పటికే వెలాసిటీ సగం స్కోరు (10 ఓవర్లలో 82-3)  ఛేదించింది. 

షఫాలీ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన లారా వోల్వార్డ్ట్ (35 బంతుల్లో 51 నాటౌట్.. 7 ఫోర్లు.. 1 సిక్స్)  రన్ రేట్ పడిపోకుండా ఆడింది. దీప్తి శర్మ  (25 బంతుల్లో 24 నాటౌట్.. 2 ఫోర్లు) తో కలిసి ఆమె నాలుగో వికెట్ కు 71 పరుగులు జోడించి వెలోసిటీకి విజయాన్ని అందించింది.   

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన సూపర్ నోవాస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఆ జట్టులో హర్మన్ ప్రీత్ కౌర్ (51 బంతుల్లో 71.. 7 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో   సూపర్ నోవాస్ ఆ మాత్రం స్కోరైనా చేసింది. తానియా భాటియా (36) కూడా రాణించింది. 

PREV
click me!

Recommended Stories

T20 World Cup: భారత జట్టులో శుభ్‌మన్ గిల్‌కు నో ఛాన్స్.. అసలు కారణం ఇదే !
T20 World Cup 2026: షాకిచ్చారు భయ్యా.. స్టార్ ప్లేయర్లను బయటకు పంపించేశారు !