2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న రాహుల్ ద్రావిడ్... ద్రావిడ్ కోచింగ్‌లో 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన టీమిండియా..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ముగిసింది. ఈ టోర్నీతో పాటే టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, మిగిలిన కోచింగ్ స్టాఫ్ కాంట్రాక్ట్ గడువు కూడా ముగిసింది. మరో మూడు రోజుల్లో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడబోతోంది భారత జట్టు. నవంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచుల ఇండియా - ఆస్ట్రేలియా టీ20 సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ వంటి సీనియర్లకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది..
ఈ సిరీస్‌కి నవంబర్ 20 లేదా 21న టీమ్‌ని అనౌన్స్ చేయబోతోంది సెలక్షన్ కమిటీ. ఇదే సమయంలో రాహుల్ ద్రావిడ్ అండ్ కో భవితవ్యంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు రాహుల్ ద్రావిడ్..
ద్రావిడ్ కోచింగ్‌లో 2022 ఆసియా కప్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన భారత జట్టు, 2022 టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ నుంచి ఇంటికి వచ్చేసింది. సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ ఓడిపోవడంతో పాటు వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయ్యింది. ద్రావిడ్ హెడ్ కోచ్ అయ్యాక టీమిండియా, 2022 ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లను మార్చింది.
2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన తర్వాత రాహుల్ ద్రావిడ్‌కి టీమిండియా హెడ్ కోచ్‌గా కొనసాగుతారా? అనే ప్రశ్న ఎదురైంది. దానికి రాహుల్ ద్రావిడ్, ‘నేను అవన్నీ ఇంకా ఆలోచించలేదు. కేవలం ఫైనల్ వరకే పూర్తి ఫోకస్ పెట్టా. త్వరలోనే నా నిర్ణయం చెబుతాను..’ అని కామెంట్ చేశాడు.
రాహుల్ ద్రావిడ్, టీమిండియా హెడ్ కోచ్‌గా కొనసాగేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని సమాచారం. అయితే బీసీసీఐ మాత్రం జూన్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్ 2024 వరకూ ద్రావిడ్‌ని హెడ్ కోచ్‌గా కొనసాగించాలని భావిస్తోంది. మరి దీనికి ద్రావిడ్ ఒప్పుకుంటాడా? లేదా? అనేది త్వరలో తేలిపోనుంది.