రోహిత్ తో టెస్టుల్లోనూ ఓపెనింగ్...: ఎమ్మెస్కే ఆసక్తికర వ్యాఖ్యలు

By Arun Kumar PFirst Published Sep 10, 2019, 5:54 PM IST
Highlights

రోహిత్ శర్మ ఇకపై పరిపూర్ణమైన ఓపెనర్ గా మారనున్నాడా అంటే టీమిండియా సెలెక్టర్ల నుండి అవుననే సమాధానం వస్తోంది. ఇకపై టెస్ట్  క్రికెట్లో  కూడా రోహిత్ తో ఓపెనింగ్ చేయించే విషయంపై చర్చిస్తున్నట్లు చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు.  

అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ పేరు టాప్ టెన్ లో వుంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అయితే అతడు గొప్ప బ్యాట్స్ మెనే కాదు అంతకంటే గొప్ప ఓపెనర్. ఇలా టీ20, వన్డేల్లో ఓపెనర్ గా అదరగొడుతున్నప్పటికి టెస్టుల్లో మాత్రం రోహిత్ రాణించలేకపోతున్నాడు. దీంతో అతడు టెస్ట్ క్రికెట్ కు పనికిరాడన్న అభిప్రాయం టీమిండియా మేనేజ్ మెంట్ లో ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇటీవల వెస్టిండిస్ తో జరిగిన టెస్ట్ సీరిస్ లో రోహిత్ ను కాదని కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, హనుమ విహారీ వంటి జూనియర్లను ఆడించారు. ఈ నిర్ణయాన్ని మాజీ కెప్టెన్ గంగూలీ వంటి సీనియర్లు తప్పుబడుతూ రోహిత్ తో టెస్టుల్లో కూడా ఓపెనింగ్ చేయాలని మేనేజ్‌మెంట్ సూచించారు.

అయితే తాజాగా గంగూలీ వ్యాఖ్యలపై టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. రోహిత్ లో టెస్టుల్లోనూ ఓపెనింగ్ చేసే సత్తా వుందంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిమిత ఓవర్ల పార్మాట్లలోనే కాదు టెస్టుల్లోనూ రోహిత్ తో ఓపెనింగ్ చేయించే అంశంపై సెలెక్షన్ కమిటీ సభ్యులతో చర్చించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం టీమిండియా టెస్ట్ ఫార్మాట్లో మంచి ఓపెనర్ కోసం వెతుకుతోందని...అది రోహిత్ శర్మే ఎందుకు కాకూడదని ఎమ్మెస్కే అభిప్రాయపడ్డాడు. 

వెస్టిండిస్ పర్యటనలో కెఎల్ రాహుల్ ఓపెనర్ గా రాణించలేకపోయాడు. అతడు మంచి ప్రతిభగల ఆటగాడే అయినప్పటికి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మాత్రం పరవాలేదనిపించాడు. కాబట్టి రాహుల్ స్థానంలో రోహిత్ తో ఓపెనింగ్ చేయించాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లున్నారు. అందులో భాగంగానే ఎమ్మెస్కే ఈ వ్యాఖ్యలు చేసివుంటాడని క్రీడావర్గాల్లో అప్పుడే చర్చ మొదలయ్యింది. 

సంబంధిత వార్తలు

ప్రపంచ స్థాయి ఓపెనర్ ని టీమిండియా కాదనుకుంటోంది : గంగూలీ

ఆ ముగ్గురి కోసం... టీమిండియా మేనేజ్‌మెంట్‌పై గంగూలీ గరంగరం
 

click me!