Worldcup 2023: కేఎల్ రాహుల్ షాకింగ్ రియాక్షన్ ..!

ఈ మ్యాచ్ లో టీమిండియాను కాపాడింది కోహ్లీ, రాహుల్ అని చెప్పొచ్చు. అయితే, విన్నింగ్ పరుగులు చేసినా కూడా, రాహుల్ మాత్రం మ్యాచ్ మధ్యలో షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. 


వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని టీమిండియా ఘన విజయంతో మొదలెట్టింది. 200 పరుగుల లక్ష్యఛేదనలో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాని, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ వీరోచిత పోరాటంతో ఆదుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కి 165 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పారు. కాగా, ఈ మ్యాచ్ లో టీమిండియాను కాపాడింది కోహ్లీ, రాహుల్ అని చెప్పొచ్చు. అయితే, విన్నింగ్ పరుగులు చేసినా కూడా, రాహుల్ మాత్రం మ్యాచ్ మధ్యలో షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Great Knock by Klasssy Man 💥🔥

Just miss from Century 😞
And Finished in Style 💥 pic.twitter.com/OazFxCSsMP

— REVANᴾᵘˢʰᵖᵃᵀʰᵉᴿᵘˡᵉ²💥 (@fastup_shindu)

ఈ మ్యాచ్ లో రాహుల్ ప్రదర్శనకు అందరూ ఫిదా అయిపోయారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్ లో సిక్సర్ బాది జట్టును విజయ తీరాలను చేర్చిన రాహుల్, 3రుగులతో సెంచరీని దూరం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత కూడా కేఎల్ రాహుల్ ముఖంలో ఓ నిరుత్సాహం స్పష్టంగా కనపడింది. అది, సెంచరీ మిస్ అవ్వడం వల్ల కలిగిన నిరుత్సాహం కావడం గమనార్హం. షాక్ అవుతూ ఓ ఎక్స్ ప్రెషన్ పెట్టాడు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Latest Videos

 

ఈ మ్యాచ్‌లో భారత్ విజయానికి సిక్సర్ అవసరం కావడంతో రాహుల్ సెంచరీకి ఇంకా 9 పరుగుల దూరంలో ఉన్నాడు. అతను ఒక ఫోర్ తర్వాత ఒక సిక్స్ కొట్టగలిగితే అది ఇప్పటికీ సాధ్యమే, కానీ అతను మొదట బంతిని సిక్సర్ కొట్టడం ముగించాడు. అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు, కానీ అతను విజయంతో స్టేడియం సందడి చేయడంతో చిరునవ్వుతో  కనిపించాడు.

 ఆదివారం జరిగిన క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ను రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కానీ, ఆ తర్వాత కోహ్లీ, రాహుల్ భాగస్వామ్యంతో  విజయ తీరాలకు చేర్చారు. ఫైనల్ గా  ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.
 

click me!