భర్తను పక్కనబెట్టుకుని పరాయి మొగాళ్లతో ఏంటా పనులు..? చహాల్ భార్యపై నెటిజన్ల ఆగ్రహం..

Published : Feb 26, 2023, 06:57 PM IST
భర్తను పక్కనబెట్టుకుని పరాయి మొగాళ్లతో ఏంటా పనులు..? చహాల్ భార్యపై నెటిజన్ల ఆగ్రహం..

సారాంశం

Dhanashree Verma:  టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహాల్ భార్య ధనశ్రీ వర్మ చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు.  చహాల్ ను పక్కనబెట్టుకుని  పరాయి పురుషులతో  ఆమె... 

భారత  క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్  యుజ్వేంద్ర చహాల్ కు భార్య ధనశ్రీ వర్మతో దూరం మరింత పెరిగిందా..?  గతంలో  ఈ ఇద్దరూ విడిపోతున్నారని కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా ఆమె పెడుతున్న పోస్టులు కూడా  అనుమానాలను మరింత పెంచుతున్నాయి.  పలు సందర్భాల్లో ఈ ఇద్దరూ మీడియా ముందుకు వస్తున్నా  వీళ్లిద్దరి మధ్య బ్రేకప్ వార్తలకు మాత్రం ఎండ్ కార్డ్ పడటం లేదు. తాజాగా  ధనశ్రీ  ఇన్‌స్టాలో షేర్ చేసిన  వీడియో కూడా ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. 

ధనశ్రీ ఆదివారం ఇన్‌స్టా వేదికగా ఓ వీడియో షేర్ చేసింది.   ప్రస్తుతం ఆమె మాల్దీవులు ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నది. ఈ ట్రిప్ లో  ధనశ్రీతో పాటు చహాల్ కూడా ఉన్నాడు.  కానీ వీడియోలో ఆమె వాటర్ గేమ్స్ ఆడుతూ, ఫోటోలు తీస్తూ, రిసార్ట్ లో ఉన్న ఇతర గెస్ట్ లతో డాన్స్ లు చేస్తూ కనిపించింది. పక్కనే ఉన్న చహాల్ ను మాత్రం పట్టించుకోలేదు. 

వీడియోలో ధనశ్రీతో పాటు చహాల్ పలుమార్లు కనిపించినా  ఆమె మాత్రం..  ఈ లెగ్ స్పిన్నర్ తో తొలినాళ్లలో కనిపించినంత గ్రేస్ గా డాన్స్ చేయలేదు. కానీ  ఇతర గెస్ట్ లతో మాత్రం బికినీలలో రెచ్చిపోయింది.  వీడియో తీస్తూనే  బికినీలో తన అందాలను వంగి వంగి వడ్డించింది.  గత కొంతకాలంగా ఆమె అందాల ప్రదర్శనకు దిగుతున్న విషయం తెలిసిందే. తాజా వీడియోలో చహాల్ పక్కనున్నా ఇతర గెస్ట్ లు ఉండగానే అందాల వడ్డింపు డోస్ పెంచడం గమనార్హం. 

 

కాగా ఈ వీడియోపై నెటిజన్లు  మండిపడుతున్నారు. ‘అసలు నువ్వు చహాల్ ను ఎందుకు పట్టించుకోవడం లేదు..? ప్రతీసారి నీ భర్తను నువ్వు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావ్...?’ అని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఓ నెటిజన్.. ‘చహాల్ ను నీ బిల్లులు కట్టేందుకు తీసుకెళ్లావా..?’అని రాసుకొచ్చాడు.  ‘పాపం చహాల్.. ఈ ప్రపంచంలో అతడి కంటే దురదృష్టవంతుడు మరొకడు ఉండడు. తన ముందే  భార్య  వేరే మగాళ్లతో బికినీలలో డాన్సులు చేస్తుంటే చూస్తూ కూర్చోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాడు..’ అని  కామెంట్ చేస్తున్నారు.  

 

ఓ నెటిజన్ అయితే.. ‘అసలు టీమిండియాలో మరే క్రికెటర్ భార్య అయినా  ఇలా భర్త పక్కనే ఉండగా మరో మొగాడితో ఇలా చిందులు వేసిందా..?   ఇలా చేసేదానివి నువ్వు ఒక్కదానివే.. కొంచెం పద్ధతిగా ఉండటం నేర్చుకో..’అని చురకలు అంటిస్తున్నారు.   ఒక నెటిజన్.. ‘చహాల్ భాయ్ ను నువ్వు ఎలా వాడాలో అలా వాడుతున్నావ్. అతడు లేకుంటే నువ్వు గోవా కూడా వెళ్లలేవ్..’అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోతో పాటు నెటిజన్ల కామెంట్స్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !