ఒకరికి కల.. మరొకరిది ఆధిపత్యం.. విజేత ఎవరు..? కీలక పోరులో టాస్ గెలిచిన ఆసీస్

Published : Feb 26, 2023, 06:08 PM ISTUpdated : Feb 26, 2023, 06:15 PM IST
ఒకరికి కల.. మరొకరిది ఆధిపత్యం..  విజేత ఎవరు..?  కీలక పోరులో టాస్ గెలిచిన ఆసీస్

సారాంశం

ICC Womens T20 World Cup 2023: ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్  లో భాగంగా నేడు దక్షిణాఫ్రికా - ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ జరుగుతున్నది.   డిఫెండింగ్ ఛాంపియన్ గా ఆసీస్.. తొలిసారి కప్పు కొట్టాలనే లక్ష్యంతో  సౌతాఫ్రికాలు  బరిలోకి దిగుతున్నాయి. 

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరింది. కేప్‌టౌన్ లోని న్యూలాండ్స్ స్టేడియం వేదికగా  నేడు దక్షిణాఫ్రికా - ఆస్ట్రేలియాలు తుది పోరులో ఢీకొంటున్నాయి.  ఇంతవరకు ఐసీసీ టోర్నీలలో ఫైనల్ చేరని (పురుషుల, మహిళల)  దక్షిణాఫ్రికా.. స్వదేశంలో అద్భుతాలతో  ఆఖరి పోరుకు సిద్ధమవగా,  ఈ ఫార్మాట్ లో ఇదివరకే  ఐదు  ట్రోఫీలు గెలిచిన ఆసీస్ ఆరోసారి ట్రోఫీని ముద్దాడేందుకు సిద్ధంగా ఉంది. మరి ఈ రెండు   జట్ల మధ్య విజేత ఎవరో తేలాలంటే  మరో  మూడు గంటలు ఆగాల్సిందే.  

న్యూలాండ్స్ వేదికగా జరుగుతున్న  టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో  ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్  చేయనుంది.  దక్షిణాఫ్రికా బౌలింగ్  కు రానుంది.  ఇరు జట్లూ గత మ్యాచ్ లలో ఆడిన  టీమ్ లతోనే బరిలోకి దిగుతున్నాయి. 

ఇంతవరకూ   ఐసీసీ టోర్నీలలోనే గాక  టీ20లలో దక్షిణాఫ్రికాపై ఆసీస్ ఓడిపోలేదు.  ఆ జట్టులో బెత్ మూనీ, అలీస్సా హీలి, ఆష్లే గార్డ్‌నర్ లు  అత్యద్భుత ఫామ్ లో ఉన్నారు.  కెప్టెన్ మెగ్ లానింగ్ కూడా  భారత్ తో కీలక ఇన్నింగ్స్ ఆడి టచ్ లోనే ఉంది.  వీళ్లను నిలువరించడం  దక్షిణాఫ్రికాకు సవాలే.  

అయితే సౌతాఫ్రికా కూడా   ఈ టోర్నీ తొలి మ్యాచ్ లో ఓడినా తర్వాత పుంజుకున్న తీరు ఆదర్శనీయం. వరుసగా మ్యాచ్ లను గెలుస్తూ సెమీస్ లో ఇంగ్లాండ్ ను ఓడించి  తమ దేశ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఐసీసీ టోర్నీ ఫైనల్ చేరిన జట్టుగా  సఫారీలు రికార్డు సృష్టించారు. ఆ జట్టు లో  ఓపెనర్లు లారా వోల్వార్ట్, టజ్మీన్ బ్రిట్స్ లు మంచి ఫామ్ లో ఉన్నారు.  వారికి తోడు మరిజనె కాప్ కూడా  మంచి ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నది. బౌలర్లలో  షబ్నిమ్ ఇస్మాయిల్,   అయబొంగ  ఖాక లు ఇరగదీస్తున్నారు.  దీంతో ఇరు జట్ల మధ్య  ఉత్కంఠతో కూడిన థ్రిల్లర్  ను అభిమానులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.

 

తుది జట్లు : 

దక్షిణాఫ్రికా :  లారా వోల్వార్ట్,  తజ్మిన్ బ్రిట్స్, మరిజనె కాప్, చోలె ట్రియాన్, నడైన్ డె క్లెర్క్, సూనె లుస్ (కెప్టెన్), అన్నెకె బోష్, సినాలో జఫ్టా, షబ్నిమ్ ఇస్మాయిల్, అయబొంగ ఖాక, మ్లబ 

ఆస్ట్రేలియా :  అలీస్సా హీలి, బెత్ మూనీ, మెగ్ లానింగ్ (కెప్టెన్), ఆష్లే గార్డ్‌నర్, గ్రేస్ హారీస్, ఎల్లీస్ పెర్రీ, తహిలా మెక్‌గ్రాత్, జార్జియా వెర్హమ్, జెస్ జొనాసేన్, మేగనా షుట్, డారీస్ బ్రౌన్ 

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !