Suryakumar Yadav: చివరగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆడిన సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా ఆ తర్వాత ఏ సిరీస్‌లోనూ ఆడలేదు. దీంతో టీ20 క్రికెట్ నెంబర్.1 బ్యాట్స్ మన్ వచ్చే ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగుతాడా? లేదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
IPL 2024-Suryakumar Yadav : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ (ఐపీఎల్ 2024) మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా క్రికెట్ టోర్నీలో తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్ 2024 కోసం ప్రస్తుతం అన్ని జట్లు తమకు అందుబాటులో ఉన్న ప్లేయర్లతో ప్రాక్టిస్ ను మొదలుపెట్టాయి. ఇదిలా ఉండగా ఐపీఎల్ లో 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో ఈ సారి అనేక మార్పులు చేసింది. పక్కాగా వ్యూహాలు రచిస్తూ ఐపీఎల్ 2024 టైటిల్ ను గెలుచుకోవాలని చూస్తోంది.
అయితే, ముంబై ఇండియన్స్ జట్టు స్టార్ ప్లేయర్, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 ప్లేయర్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ గురించి పెద్దగా సమాచారం అందుబాటులో లేదు. దీంతో అతను ఈ మెగా టోర్నీలో ఆడుతాడా? అనే సందేహం నెలకొంది. ఎందుకంటే గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్.. గాయం కారణంగా అప్పటి నుంచి ఏ సిరీస్‌లోనూ ఆడలేదు. అతను ప్రస్తుతం స్పోర్ట్స్ హెర్నియా తో బాధపడుతున్నాడని సమాచారం. దీని కోసం కొన్ని వారాల క్రితం శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. దీంతో ఐపీఎల్ కు అందుబాటులో ఉంటాడా? లేదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
undefined
ఈ క్రమంలోనే వీటన్నింటికీ ముగింపు పలికేందుకు సూర్యకుమార్ యాదవ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్పష్టత ఇచ్చాడు. తనపై అనేక ఫుకార్లు పుట్టిస్తున్నారని పేర్కొన్నాడు. "నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. నా ఫిట్‌నెస్‌పై రకరకాల సందేహాలు ఉన్నాయి. కొన్ని వారాల క్రితం నాకు హెర్నియా సర్జరీ జరిగిన మాట వాస్తవమే. అంతే కాకుండా కాలికి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌ని పొందడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాను. త్వరలోనే మీ అందరిని గ్రౌండ్ లో కలుస్తాను.. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు" అని తెలిపాడు. అయితే, ముంబై ఫ్రాంచైజీ నుంచి సూర్యకుమార్ యాదవ్ ఆరోగ్యం, ఇతర విషయాల గురించి ఎలా ప్రకటన చేయలేదు.
భారత్ దెబ్బకు ఇంగ్లాండ్‌కు దిమ్మదిరిగిపోయింది.. బాజ్ బాల్ మార్పులు చేస్తున్న మెకల్లమ్ !