నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్... యూవీ ఔట్, నా గుండె పగిలింది: కైఫ్

By Siva KodatiFirst Published Apr 21, 2020, 9:22 PM IST
Highlights

యూవీ, నేను క్రీజులో చివరి వరకు ఉంటే మ్యాచ్ గెలువొచ్చు అనుకున్నా.. కానీ, యూవీ ఔటవ్వడంతో ఒక్కసారిగా తన గుండె పగిలినంత పనయ్యిందన్నాడు కైఫ్. ఆ పరిస్థితుల్లో టీమిండియా గెలుపు దాదాపు అసాధ్యం అనుకున్నా ఎందుకంటే అప్పటికీ భారత్ 59 పరుగుల లక్ష్యం భారత్ ముందుంది. 

మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం భారత క్రికెట్‌ను కుదేపేస్తున్న సమయంలో టీమిండియాలో మళ్లీ నూతనోత్తేజాన్ని నింపింది 2002 నాట్‌వెస్ట్ సిరీస్. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్‌లో భారత జట్టు విజయం సాధించడంతో అప్పటి టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ షర్ట్ విప్పి గ్యాలరీలో సందడి చేసిన సన్నవేశాన్ని ఏ భారతీయుడు మరచిపోలేడు.

326 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించే క్రమంలో టాప్ ఆర్డర్ విఫలమైన ఈ ఉత్కంఠ పోరులో మహమ్మద్ కైఫ్ (87), యువరాజ్ సింగ్ (69) అద్భుత బ్యాటింగ్‌తో భారత్ చరిత్ర సృష్టించింది.

Also Read:ఇప్పుడే కాదు అప్పటి నుండి హార్దిక్ అంతేనా....?

ప్రస్తుతం లాక్‌డౌన్ సందర్భంగా అలనాటి జ్ఞాపకాలను పంచుకుంటున్నారు పలువురు  క్రికెటర్లు. ఈ క్రమంలో నాట్‌వెస్ట్ సిరీస్ హీరోలు మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్‌లు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో అభిమానులతో పంచుకున్నారు.

326 పరుగుల లక్ష్యఛేదనలో 145 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఉత్కంఠగా సాగుతున్న సమయంలో 69 పరుగుల వ్యక్తిగత స్కోరు యువరాజ్ ఔటయ్యాడని కైఫ్ గుర్తుచేసుకున్నాడు.

యూవీ, నేను క్రీజులో చివరి వరకు ఉంటే మ్యాచ్ గెలువొచ్చు అనుకున్నా.. కానీ, యూవీ ఔటవ్వడంతో ఒక్కసారిగా తన గుండె పగిలినంత పనయ్యిందన్నాడు కైఫ్. ఆ పరిస్థితుల్లో టీమిండియా గెలుపు దాదాపు అసాధ్యం అనుకున్నా ఎందుకంటే అప్పటికీ భారత్ 59 పరుగుల లక్ష్యం భారత్ ముందుంది.

అయితే టెయిలెండర్ల సాయంతో బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి మరో మూడు బంతులు మిగిలి ఉండగానే భారత్‌‌ను కైఫ్ విజయతీరాలకు చేర్చాడు. కాగా టీమిండియాలో ఫీల్డింగ్ గురించి చెప్పుకోవాలంటే ముందుగా గుర్తొచ్చేది మహ్మద్ కైఫ్.

Also Read:అది ఓ కుటుంబం లాంటిది: చెన్నై సూపర్‌ కింగ్స్‌‌పై బ్రావో ప్రశంసల జల్లు

మైదానంలో చురుగ్గా కదులుతూ అతను భారత్‌కు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించాడని యువరాజ్ సింగ్ ప్రశంసించాడు. పాయింట్, కవర్‌లలో తామిద్దరం కలిసి భారత జట్టులో ఫీల్డింగ్ విభాగంలో ఒక కొత్త సరళిని తీసుకొచ్చామని చెప్పాడు.

ప్రస్తుత భారత జట్టులో మంచి ఫీల్డర్లు ఉన్నారని.. కానీ టీమిండియా ఫీల్డింగ్‌లో కొత్త ట్రెండ్‌ను మాత్రం తామిద్దరమే తీసుకొచ్చామని యువరాజ్ సింగ్ అన్నాడు. 

click me!