ఇప్పుడే కాదు అప్పటి నుండి హార్దిక్ అంతేనా....?

Published : Apr 21, 2020, 05:56 PM ISTUpdated : Apr 21, 2020, 05:58 PM IST
ఇప్పుడే కాదు అప్పటి నుండి హార్దిక్ అంతేనా....?

సారాంశం

టీం ఇండియాలో ఇలా ఆటతీరుతోనే కాదు, తన స్టైల్ తోను తన ప్రత్యేకతను చాటుతుంటాడు. వంటి నిండా టాటూలు మొదలు చెవికి రింగులు, కళ్ళకు రక రకాల కళ్లజోళ్లు, ఇలా ఎప్పటికప్పుడు నూతన హెయిర్ స్టైల్స్ తో తానెప్పుడూ ప్రత్యేకం అని చాటుతుంటాడు హార్దిక్ పాండ్య. 

ప్రస్తుత టీం ఇండియాలో హార్దిక్ పాండ్యను మించిన అల్ రౌండర్ లేడు అంటే అతిశయోక్తి కాదు. టీం ఇండియాకు టి20 ప్రపంచ కప్ ముంగిట ఒక బలమైన అస్త్రం హార్దిక్ పాండ్య నాయి చెప్పవచ్చు. ఇటు బౌలింగ్ లో ఫుల్ టైం బౌలర్ స్థాయిలో పూర్తి కోటవర్లను వేయగలడు. అటు బ్యాటింగ్ లో చివర్లో వచ్చి మెరుపులు మెరిపించి జట్టును విజయతీరాలకు కూడా చేర్చగలడు. 

టీం ఇండియాలో ఇలా ఆటతీరుతోనే కాదు, తన స్టైల్ తోను తన ప్రత్యేకతను చాటుతుంటాడు. వంటి నిండా టాటూలు మొదలు చెవికి రింగులు, కళ్ళకు రక రకాల కళ్లజోళ్లు, ఇలా ఎప్పటికప్పుడు నూతన హెయిర్ స్టైల్స్ తో తానెప్పుడూ ప్రత్యేకం అని చాటుతుంటాడు హార్దిక్ పాండ్య. 

హార్దిక్ పాండ్య స్టైల్స్ ఏదో ఇప్పుడు టీంలోకి వచ్చాక అనుకుంటే పొరపాటు. చిన్నప్పటినుండి స్టైల్స్ కి అతడు పెట్టింది పేరు. ఈ లాక్ డౌన్ వేళ దొరికిన ఖాళీ సమయంలో అతడు తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. 

తాజాగా అతడు 2011 లో అతడి అన్న, సహచర టీం ఇండియా ప్లేయర్ కరుణాళ్ పాండ్యతో కలిసి ఉన్న ఫోటోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. అప్పట్లో కూడా హార్దిక పాండే ఫంకీ షేడ్స్ తో, మెడలో ఒక చైన్ తో "స్వాగ్ మేర దేశీ హై" అని కాప్షన్ పెట్టాడు. 

ఆ ఫొటోలో అతడి సోదరుడు కరుణాళ్ పాండ్య తెల్లటి టీషీర్ట్ లో చాలా అమాయకంగా కనబడుతున్నాడు. చిన్నప్పుడు 9వ తరగతిలోనే అతడు క్రికెట్ మీద ఫోకస్ చేయడానికి చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసాడు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలివే.. గంభీర్ దెబ్బ !
Arshdeep : అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు.. ఒకే ఓవర్‌లో 7 వైడ్లు, 13 బంతులు ! గంభీర్ సీరియస్