ఐపీఎల్‌లో నెట్‌ బౌలర్లుగా విండీస్ బౌలర్లు... మన లీగ్‌ క్రేజ్‌కి ఇంతకంటే బెటర్ ప్రూఫ్ కావాలా...

By Chinthakindhi RamuFirst Published Sep 13, 2021, 5:08 PM IST
Highlights

ఐపీఎల్‌లో నెట్ బౌలర్లుగా  వెస్టిండీస్ జట్టు కీ బౌలర్లు రవి రాంపాల్, ఫీడెల్ ఎడ్వర్డ్స్, షెల్డన్ కాంట్రెల్, డొమినిక్ డ్రేక్స్...

ఇప్పుడు క్రికెట్ ఆడే ప్రతీ దేశానికి ఓ టీ20 లీగ్ ఉంది. అయితే అన్నింటికీ బాబులాంటి లీగ్ మాత్రం ఐపీఎల్‌... బడ్జెట్ విషయంలో, వాల్యూ విషయంలో, క్వాలిటీ ప్లేయర్లు, స్టార్ అట్రాక్షన్ ఇలా ఏ విషయంలో చూసుకున్నా... ఐపీఎల్‌కి పోటీ వచ్చే లీగ్ మరోటి కనిపించదు...

ఐపీఎల్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో చెప్పే సంఘటనే ఇది. వెస్టిండీస్ జట్టులో కీ బౌలర్లుగా ఉన్న రవి రాంపాల్, ఫీడెల్ ఎడ్వర్డ్స్, షెల్డన్ కాంట్రెల్, డొమినిక్ డ్రేక్స్... ఐపీఎల్‌లో నెట్ బౌలర్లుగా వ్యవహరించబోతున్నారు...

ఐపీఎల్‌లో సెలక్ట్ కాలేకపోయిన ఈ బౌలర్లు, ఎలాగైనా లీగ్‌లో పాల్గొనాలని వివిధ ఫ్రాంఛైజీలతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్టు సమాచారం...అయితే దీనికి మరో కారణం కూడా ఉంది. ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత యూఏఈ వేదికగానే టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ జరగనుంది.

టీ20 వరల్డ్‌కప్ సమయానికి యూఏఈ పిచ్‌లను అర్థం చేసుకునేందుకు, అదీకాకుండా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ బలహీనతలను తెలుసుకునేందుకు ఈ విధంగా ప్లాన్ వేశాడట విండీస్ బౌలర్లు... ఇప్పటికే రెండు సార్లు టీ20 వరల్డ్‌కప్ గెలిచిన వెస్టిండీస్, డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో 2021 టోర్నీ బరిలో దిగుతోంది...
 

click me!