Nicholas Pooran: నికోలస్ పూరన్ ధనాధన్‌ ఇన్నింగ్స్‌.. మెరుపు సెంచరీతో చెలరేగినా.. !

Published : Jul 31, 2023, 03:37 PM IST
Nicholas Pooran: నికోలస్ పూరన్ ధనాధన్‌ ఇన్నింగ్స్‌..  మెరుపు సెంచరీతో చెలరేగినా.. !

సారాంశం

Nicholas Pooran: నికోలస్ పూరన్ మెరుపు సెంచరీతో ఎంఐ న్యూయార్క్ మేజర్ లీగ్ క్రికెట్ 2023 టైటిల్ గెలుచుకుంది. విండీస్ బ్యాట్స్ మన్ 55 బంతుల్లో 137 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేవలం 40 బంతుల్లో మూడు అంకెల స్కోరును అధిగమించాడు. 184 పరుగుల లక్ష్యాన్ని నాలుగు ఓవర్లు మిగిలివుండగానే, ఏడు వికెట్ల తేడాతో ముగించాడు.  

Major League Cricket 2023-Nicholas Pooran: నికోలస్ పూరన్ మెరుపు సెంచరీతో ఎంఐ న్యూయార్క్ మేజర్ లీగ్ క్రికెట్ 2023 టైటిల్ గెలుచుకుంది. విండీస్ బ్యాట్స్ మన్ 55 బంతుల్లో 137 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేవలం 40 బంతుల్లో మూడు అంకెల స్కోరును అధిగమించాడు. 184 పరుగుల లక్ష్యాన్ని నాలుగు ఓవర్లు మిగిలివుండగానే, ఏడు వికెట్ల తేడాతో ముగించాడు. అయితే, ఈ మరుపురాని ఇన్నింగ్స్‌గా పురాన్ రికార్డులకు తోడ‌య్యే అవ‌కాశం లేదు. అంటే ఇది నామ‌మాత్రమే.. !

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌-2023 ఫైనల్ లో మ్యాచ్ లో ఎంఐ న్యూయార్క్‌ బ్యాట్స్ మన్ ఆకాశ‌మే హ‌ద్దుగా బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. అత‌ని విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు చుక్క‌లు చూపించాడు. సీటెల్‌ ఓర్కాస్‌తో జ‌రిగిన  మ్యాచ్‌లో వరుస బౌండరీలు కొడుతూ.. 55 బంతులతో అజేయ సెంచరీ(137)తో మెరిశాడు. పూరాన్ ఇన్నింగ్స్ లో మొత్తం 10 ఫోర్లు, 13 సిక్సర్లు, 249.09 స్ట్రైక్‌రేటుతో  పరుగుల వ‌ర‌ద పారించాడు. ఎంఐ న్యూయార్క్ ను విజ‌య‌తీరాల‌కు చేర్చి  ఎంఎల్‌సీ(MLC) టైటిల్ అందించాడు. అయితే, నికోల‌స్ పూరాన్ ఈ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ అత‌ని వ్యక్తిగ‌త రికార్డుల‌కు తోడ‌య్యే అవ‌కాశం లేదు. ఎందుకంటే ఈ లీగ్ ను యూఎస్ఏ నిర్వ‌హిస్తోంది. దీనికి  అంతర్జాతీయ క్రికెట్‌ మండలి నిబంధనల ప్రకారం అధికారిక టీ-20 హోదా లేదు. కాబ‌ట్టి నికోలస్‌ పూరన్ ఈ మెరుపు సెంచ‌రీ మరుపురాని ఇన్నింగ్స్‌గా గుర్తుపెట్టుకోవడమే తప్ప.. అతడి వ్య‌క్తిగ‌త‌ రికార్డుల్లో దీనికి చోటులేదు. 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !