
టీమిండియా యువ క్రికెటర్ శుభమన్ గిల్ సత్తా చాటాడు. పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజమ్ పేరిట ఉన్న రికార్డును గిల్ బ్రేక్ చేయడం గమనార్హం. వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డేలో గిల్ ఈ సత్తా చాటడం గమనార్హం. నిజానికి ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. కానీ, గిల్ మాత్రం తన ఖాతాలో రికార్డు వేసుకోవడం విశేషం.
వన్డేల్లో ఇప్పటి వరకు 26 ఇన్నింగ్స్‌లు ఆడిన గిల్.. మొత్తం 1352 రన్స్ చేశాడు. అయితే 50 ఓవర్ల ఫార్మాట్‌లో బాబర్ ఆజమ్ 26 ఇన్నింగ్స్‌లో 1322 రన్స్ చేశాడు. రెండో వన్డేలో 34 రన్స్ చేసిన గిల్ ఆ మైలురాయిని దాటేశాడు. దీంతో మొన్నటి వరకు బాబర్ పేరిట ఉన్న అత్యధిక రన్స్ రికార్డును ఇప్పుడు గిల్ బ్రేక్ చేశాడు. గిల్, బాబర్ తర్వతా స్థానాల్లో జొనాథన్ ట్రాట్(1303), ఫకర్ జమాన్(1275), వాండర్ దుస్సేన్(1267) ఉన్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, వెస్టిండీస్‌తో తొలి వన్డేలో 115 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టు, రెండో వన్డేలో 181 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నా, 90/0 పరుగులతో శుభారంభం దక్కినా దాన్ని సరిగ్గా వాడుకోలేకపోయిన టీమిండియా... 40.5 ఓవర్లకే ఓడిపోవడం గమనార్హం.