ఆ విషయం గురించి మాత్రం స్పందించలేను.. డేవిడ్ వార్నర్..!

Published : Oct 28, 2021, 12:13 PM IST
ఆ విషయం గురించి మాత్రం స్పందించలేను.. డేవిడ్ వార్నర్..!

సారాంశం

కాగా జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడా వేదికలపై ఆటగాళ్లు సంఘీభావం తెలుపుతున్న విషయం తెలిసిందే. 


బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సంఘీభావం ప్రకటిస్తుందని.. ఆ జట్టు క్రికెటర్ డేవిడ్ వార్నర్ వెల్లడించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆసీస్ ఆటగాళ్లందరూ మైదానంలో మోకాలిపై కూర్చొని మద్దతునిస్తారని ఆయన స్పష్టం చేశారు.

Also Read: T20 Worldcup: ఇది కదా డ్రీమ్ ఓవర్.. ఒక్క ఓవర్లోనే మూడు వికెట్లు.. నమీబియా బౌలర్ సంచలనం

‘దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ఇచ్చిన ఆదేశాలపై నేను స్పందించలేను. మేం మాత్రం మోకాలిపై కూర్చొని సంఘీభావం ప్రకటిస్తాం. దానికి మేం సిద్ధం’ అని వార్నర్‌ అన్నాడు. 

Also Read: T20 worldcup 2021: సన్‌రైజర్స్ జట్టు, వార్నర్‌ను అవమానించింది... ఐపీఎల్ వల్లే అతనిలా ఆడుతున్నాడు...

కాగా జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడా వేదికలపై ఆటగాళ్లు సంఘీభావం తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌ ఆరంభానికి ముందు.. దక్షిణాఫ్రికా బోర్డు సైతం మోకాలిపై కూర్చుని ఉద్యమానికి మద్దతు పలకాల్సిందిగా ఆటగాళ్లకు ఆదేశాలు ఇచ్చింది. అయితే, వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ మాత్రం.. ఇందుకు అభ్యంతరం తెలిపాడు. అలా చేయనని చెబుతూ జట్టు నుంచి తప్పుకొన్నాడు. ఈ నేపథ్యంలో డికాక్‌ నిర్ణయం గురించి వార్నర్‌ను ప్రశ్నించగా... ఈ మేరకు స్పందించాడు.

Also Read: జాతి వివక్ష... ఎన్గిడి నువ్వు నిజంగా మూర్ఖుడివే..

PREV
click me!

Recommended Stories

T20 World Cup: దటీజ్ ఇషాన్ కిషన్.. వరల్డ్ కప్ జట్టులో చోటు కోసం ఏం చేశాడో తెలుసా?
T20 World Cup: భారత జట్టులో శుభ్‌మన్ గిల్‌కు నో ఛాన్స్.. అసలు కారణం ఇదే !