ఇప్పటికే 27 మందిని వాడాం.. అవసరమైతే వాళ్లను కూడా..: మూడో టీ20కి ముందు హిట్ మ్యాన్ షాకింగ్ కామెంట్స్

Published : Feb 27, 2022, 03:36 PM ISTUpdated : Feb 27, 2022, 03:37 PM IST
ఇప్పటికే 27 మందిని వాడాం.. అవసరమైతే వాళ్లను కూడా..: మూడో టీ20కి ముందు హిట్ మ్యాన్ షాకింగ్ కామెంట్స్

సారాంశం

India vs Srilanka: ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ నుంచి ప్రారంభం కాబోయే పొట్టి ప్రపంచకప్-2022 సమరాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తున్న భారత జట్టు...

టీ20 ప్రపంచకప్-2022 కు మరో ఏడు నెలలే సమయం ఉండటంతో భారత జట్టు వీలైనన్ని ఆప్షన్లను పరిశీలిస్తున్నది.  ఐపీఎల్, దేశవాళీ టోర్నీల ద్వారా వెలుగులోకి వస్తున్న క్రికెటర్లలో పలువురు ఇప్పటికే  జాతీయ జట్టులోకి చోటు దక్కించుకుంటున్నారు. ముఖ్యంగా గతేడాది రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు  అప్పగించాక.. జట్టులోకి కొత్త కుర్రాళ్ల రాక, వారికి సరైనన్ని అవకాశాలివ్వడం ఎక్కువైంది.  ఈ నేపథ్యంలో టీమిండియా సారథి హిట్ మ్యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము ఇప్పటికే 27 మందిని ఆడించామని అన్నాడు. 

శనివారం ధర్మశాల వేదికగా లంకతో ముగిసిన రెండో టీ20 అనంతరం హిట్ మ్యాన్ స్పందిస్తూ... ‘ఇప్పటివరకు  మేం 27 మందిని ఆడించాం. మున్ముందు ఈ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది..’ అని అన్నాడు. 

లంకతో సిరీస్ కు ముందు  కేఎల్ రాహుల్, దీపక్ చాహర్,  సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ లు గాయంతో సిరీస్ నుంచి తప్పుకున్నారు. దీంతో సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లకు అవకాశం దక్కింది. అంతకుముందు విండీస్ తో సిరీస్ లో రవిబిష్ణోయ్, దీపక్ హుడా లకు కూడా అవకాశం దక్కింది. ఇక గతేడాది న్యూజిలాండ్ తో సిరీస్ సందర్భంగా వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్ లు అరంగ్రేటం చేశారు. విండీస్ తో సిరీస్ లో అవకాశం దక్కిన  ఇషాన్ కిషన్.. లంకతో రెండో టీ20లో గాయమవడంతో మూడో మ్యాచు ఆడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. దీంతో అతడి స్థానంలో  సిరాజ్ ను గానీ, అవేశ్ ఖాన్ ను గానీ ఆడించే అవకాశాలున్నాయి. 

 

ఇదే విషయమై రోహిత్ మాట్లాడుతూ.. ‘మేము సిరీస్ గెలిచాం. కానీ కొంతమందికి ఆడే అవకాశం రాలేదు.  మరికొంత మంది టెస్టులు ఆడాల్సి  ఉంది. ప్రతి ఒక్కరికీ ఛాన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం.. అయితే అంతిమంగా విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం. అదే సమయంలో ఆటగాళ్లలో సానుకూల దృక్పథం నింపడం కూడా ముఖ్యం...’ అని అన్నాడు. 

 

లంకతో ఇప్పటికే సిరీస్ ను గెలిచిన టీమిండియా..  నేడు ధర్మశాల వేదికగా జరుగబోయే నామమాత్రపు, మూడో టీ20లో గత రెండు మ్యాచులలో ఆడని ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చే అవకాశముంది. తొలి రెండు టీ20లలో ఆడని  సిరాజ్, అవేశ్ లలో ఎవరో ఒకరు తుది జట్టులో ఉంటారు. అలాగే  గాయమైన ఇషాన్ కిషన్ స్థానంలో  మయాంక్ అగర్వాల్.. రోహిత్ తో ఇన్నింగ్స్ ఆరంభించే ఛాన్సుంది. సాయంత్రం 7 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానున్నది.   

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఈజీ అన్నావ్‌గా..! ఇప్పుడేంటి మరి.. మంజ్రేకర్‌కు కోహ్లీ సెటైర్..
బంగ్లాదేశ్ పోతేనేం.. ఐసీసీ పక్కా స్కెచ్‌తో టీ20 ప్రపంచకప్‌లోకి పసికూన జట్టు.!