బిగ్ బాష్ లో పవర్ సర్జ్, ఎక్స్ ప్యాక్టర్, బూష్ బూస్ట్ నిబంధనలు... వ్యతిరేకించిన వాట్సన్

Arun Kumar P   | Asianet News
Published : Nov 19, 2020, 07:34 AM ISTUpdated : Nov 19, 2020, 09:39 AM IST
బిగ్ బాష్ లో పవర్ సర్జ్, ఎక్స్ ప్యాక్టర్, బూష్ బూస్ట్ నిబంధనలు... వ్యతిరేకించిన వాట్సన్

సారాంశం

బిగ్ బాష్ లీగ్ ను మరింత ఆకర్షణీయంగా, ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకునేందుకు మూడు కొత్త నిబంధనలను తీసుకువచ్చారు నిర్వహకులు. 

అంతర్జాతీయం:  భారత్ లో ఐపిఎల్ మాదిరిగానే ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ లీగ్ ను మరింత ఆకర్షణీయంగా, ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకునేందుకు మూడు కొత్త నిబంధనలను తీసుకువచ్చారు నిర్వహకులు. అయితే ఈ నిబంధనలు ఆటను తప్పుదారి పట్టించేలా వున్నాయని ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ షేన్ వాట్సన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. 

''బిగ్ బాష్ లీగ్ నిర్వహకులు జిమ్మిక్కులతో ప్రేక్షకులను ఆకర్షించాలని చూస్తున్నారే తప్ప ఆట నాశనం అవుతున్న విషయాన్ని గుర్తించడంలేదు. పవర్‌ సర్జ్‌, ఎక్స్‌-ఫ్యాక్టర్‌, బాష్‌ బూస్ట్ నిబంధనల గురించి చదివాను. టోర్నీ గురించి ఆలోచించడమే కాదు ఆట గురించి కూడా ఆలోచించి ఈ నిబంధనలపై నిర్ణయం తీసుకుంటూ బాగుండేది'' అని వాట్సన్ అభిప్రాయపడ్డారు. 

ఏమిటీ నిబంధనలు: 

ఎక్స్ ఫ్యాక్టర్: అంతర్జాతీయ క్రికెట్ నిబంధనల ప్రకారం ఇప్పటివరకు కేవలం సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు ఫీల్డింగ్ చేయడానికి మాత్రమే అనుమతి వుంటుంది. కానీ ఈ నిబంధన ప్రకారం సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు బ్యాటింగ్‌, బౌలింగ్ చేయొచ్చు. 

పవర్ సర్జ్: ఇది కూడా బ్యాటింగ్ జట్టుకు అనుకూలంగా వుండేలా తీసుకువచ్చిన నిబంధన. టీ20లో మొదటి ఆరు ఓవర్లు పవర్ ప్లే వుండగా దాన్ని నాలుగు ఓవర్లకు కుదించారు. మిగతా రెండు ఓవర్ల పవర్ ప్లే ను బ్యాటింగ్ జట్టు ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. 

బాష్ బూస్ట్: ఈ నిబంధన ప్రకారం ఏ జట్టయితే తొలి పది ఓవర్లలో అత్యధిక పరుగులు చేస్తుందో ఆ జట్టుకు ఒక బోనస్ పాయింట్ లభించనుంది. 
రెండు జట్ల స్కోర్లు సమానంగా ఉంటే తలో అర పాయింటు ఇస్తారు.  
 

PREV
click me!

Recommended Stories

మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలను పిచ్చిగా ఇష్టపడే ఇండియన్ స్టార్ క్రికెటర్ ఎవరో తెలుసా? ఆ ఇద్దరే ఎందుకంతఇష్టమంటే?
నెక్ట్స్ మ్యాచ్ కాదు.. టీ20 వరల్డ్ కప్ నుండే అభిషేక్ ఔట్..? జట్టులోకి యంగ్ ప్లేయర్ ఎంట్రీ ఫిక్స్