పాక్ సూపర్ లీగ్‌లో ఐపీఎల్ గ్లవ్స్... క్రికెట్ కిట్స్ కొనడానికి కూడా గతి లేదా? అంటూ ట్రోలింగ్...

Published : Nov 17, 2020, 06:54 PM ISTUpdated : Nov 17, 2020, 06:55 PM IST
పాక్ సూపర్ లీగ్‌లో ఐపీఎల్ గ్లవ్స్... క్రికెట్ కిట్స్ కొనడానికి కూడా గతి లేదా? అంటూ ట్రోలింగ్...

సారాంశం

ముంబై ఇండియన్స్ మాస్క్‌తో పాక్‌లో అడుగుపెట్టిన రూథర్‌ఫర్డ్...  క్రికెట్ కిట్ అందకపోవడంతో ఐపీఎల్ గ్లవ్స్‌తోనే బ్యాటింగ్ చేసిన ముంబై ప్లేయర్... బడాయిలు మానేసి క్రికెటర్లకి కిట్స్ కొనివ్వాలంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు...

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి పోటీగా సొంత ప్రీమియర్ లీగ్ మొదలెట్టింది పాకిస్థాన్. పాకిస్థాన్ సూపర్ లీగ్‌కి ఐపీఎల్ అంత కాకపోయినా కాస్తో కూస్తో రెస్పాన్స్ బాగానే వచ్చింది. అయితే ఐపీఎల్ కంటే పీఎస్‌ఎల్ సూపర్ హిట్టయ్యిందంటూ బడాయిలు పోయింది పాక్. అయితే పీఎస్‌ఎల్ 2020లో విండీస్ క్రికెటర్ రూథర్ ఫోర్డ్ ఐపీఎల్ గ్లవ్స్‌తో బ్యాటింగ్ చేయడం చర్చనీయాంశమైంది. 

ముంబై ఇండియన్స్ ప్లేయర్ అయిన రూథర్‌ఫర్డ్‌కి ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. క్రిస్ లీన్, మెక్‌లగాన్ లాగే రూథర్‌ఫర్డ్‌ను కూడా రిజర్వు బెంచ్‌కే పరిమితం చేసింది 2020 ఛాంపియన్ ముంబై. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వెంటనే పీఎస్‌ఎల్ కోసం పాకిస్థాన్ బయలుదేరాడు రూథర్‌ఫర్డ్.

ముంబై ఇండియన్స్ మాస్క్‌తో పాక్‌లో అడుగుపెట్టిన రూథర్‌ఫర్డ్... గ్లవ్స్ కూడా ముంబైవే వాడుతూ బ్యాటింగ్ చేయడం టీవీల్లో స్పష్టంగా కనిపించింది. ఐపీఎల్ కంటే గ్రాండ్‌గా పీఎస్‌ఎల్ నిర్వహిస్తున్నామని ఊరికే గొప్పలు చెప్పుకునే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు... క్రికెటర్లకు సరైన కిట్స్ కూడా అందించలేనంత దయనీయ పరిస్థితిలో ఉందా? అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

పీఎస్‌ఎల్ 2020లో ఫైనల్ చేరిన కరాచీ కింగ్స్ తరుపున ఆడుతున్న రూథర్‌ఫర్డ్‌కి ఆ ఫ్రాంఛైజీ కిట్‌ను సమకూర్చలేకపోయిందిట. దీంతో ముంబై గ్లవ్స్‌తోనే బరిలో దిగాడు రూథర్‌ఫర్డ్.
 

PREV
click me!

Recommended Stories

IND vs SA : టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలివే.. గంభీర్ దెబ్బ !
Arshdeep : అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు.. ఒకే ఓవర్‌లో 7 వైడ్లు, 13 బంతులు ! గంభీర్ సీరియస్