ముంబై ఇండియన్స్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా హర్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్నారు. అయితే గుజరాత్ టైటాన్స్ చేతిలో ముంబై ఇండియన్స్ జట్టు ఓటమి పాలైంది.
న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ జట్టు ఆదివారం నాడు గుజరాత్ టైటాన్స్ జట్టు చేతిలో ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ లో ఓటమి పాలైన తర్వాత గ్రౌండ్ లోనే హర్దికా పాండ్యాతో రోహిత్ శర్మ తీవ్రమైన సంభాషణ చేయడం కన్పించింది.
Mumbai Indians is now a broken side 💀
Well captained Ashish Nehra 🤌
Well bowled Umesh yadav 🔥 pic.twitter.com/Pksxy85HOI
undefined
ముంబై ఇండియన్స్ జట్టుకు హర్దిక్ పాండ్యా కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్ లో రోహిత్ శర్మను కెప్టెన్ గా తప్పించి హర్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించింది టీమ్ యాజమాన్యం. అయితే నిన్నటి మ్యాచ్ లో రోహిత్ పైనే ప్రేక్షకులు దృష్టి నిలిపారు. మ్యాచ్ సాగుతున్న సమయంలో రోహిత్ శర్మ ఇతర ఆటగాళ్లతో మాట్లాడుతున్న దృశ్యాలు కూడ కన్పించాయి.
సోషల్ మీడియాలో మరో వీడియో కూడ చక్కర్లు కొడుతుంది. రోహిత్ ను వెనుక నుండి కౌగిలించుకొనేందుకు హర్ధిక్ పాండ్యా వచ్చినట్టుగా ఓ వీడియోలో దృశ్యాలు కన్పిస్తున్నాయి. అయితే హర్దిక్ పాండ్యాతో రోహిత్ శర్మ సీరియస్ గా చర్చిస్తున్నట్టుగా ఆ వీడియోలో ఉంది.
ఈ మ్యాచ్ లో ఓటమి పాలైనప్పటికీ తమ జట్టు ఇంకా 13 మ్యాచ్ లు ఆడాల్సి ఉందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్దిక్ పాండ్యా నొక్కి చెప్పారు.చివరి ఐదు ఓవర్లలో 42 పరుగులను ఛేజ్ చేయడానికి తమ జట్టు వెనుకంజ వేస్తుందని హర్దిక్ పాండ్యా చెప్పారు. అయితే చివరి ఐదు ఓవర్లలో స్కోర్ ఛేజ్ చేయడంలో మెరుగైన ప్రదర్శన సాధిస్తామని హర్దిక్ పాండ్యా ధీమాను వ్యక్తం చేశారు.
వర్మ సింగిల్ రన్ చేయడానికి నిరాకరించిన విషయమై హర్ధిక్ పాండ్యా స్పందించారు. ఆ సమయంలో తిలక్ ది మంచి ఆలోచనగా తాను భావిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.తాను అతనికి పూర్తి మద్దతిస్తానని ఆయన పేర్కొన్నారు.