గాలిలో తేలుతూ వార్నర్ లేటెస్ట్ టిక్ టాక్ వీడియో

Published : Jun 18, 2020, 11:07 AM IST
గాలిలో తేలుతూ వార్నర్ లేటెస్ట్ టిక్ టాక్ వీడియో

సారాంశం

కేవలం పాటలకు స్టైప్పులు వేయడమే కాకుండా.. మరింత కొత్తగా చేయడం మొదలుపెట్టాడు.  

 ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ మైదానంలోకి దిగితే.. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడం అలవాటు. లాక్‌డౌన్‌లో బ్యాటు పట్టే అవకాశం లేకపోవడంతో మొబైల్‌ పట్టాడు. ఇక సోషల్‌ మీడియాలో బ్యాటింగ్‌ చేయడం మొదలుపెట్టాడు. కుటుంబ సమేతంగా టిక్​టాక్ వీడియోలు చేయడం, అభిమానులను అలరించడమే పనిగా పెట్టుకున్నాడు. 

తెలుగు, తమిళ పాటలకు టిక్ టాక్ లు చేస్తూ అభిమానులను ఫుల్ ఎంటర్ టైన్ చేస్తున్నాడు. మొన్నటి వరకు కేవలం పాటలకు డ్యాన్స్ లు చేసిన వార్నర్.. ఇప్పుడు దాంట్లో ఆరితేరాడు. కేవలం పాటలకు స్టైప్పులు వేయడమే కాకుండా.. మరింత కొత్తగా చేయడం మొదలుపెట్టాడు.

 

తాజాగా చేసిన ఓ టిక్ టాక్ అభిమానులను మరింతగా ఆకట్టుకుంటోంది. గాలిలో తేలుతూ  ఆయన చేసిన టిక్ టాక్ అదిరిపోయింది. తొలుత ఒక్క చేతిమీద బ్యాలెన్స్ ఆపి గాలిలో నిలబడిన ఆయన తర్వాత.. ఆ తర్వాత ఆ చేతిని కూడా గాలిలోనే ఉంచాడు. మొత్తం బాడీ మొత్తం గాలిలో ఉండటం విశేషం.

ఇదిలా ఉండగా... ఇటీవల బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టితో డేవిడ్ వార్నర్ ఓ సరదా టిక్​టాక్ వీడియో చేశాడు. ఫేస్ ఫిల్టర్ సాయంతో శిల్ప తన ముఖాన్ని బొమ్మలా మార్చి విచిత్రమైన గొంతుతో పాట పాడుతున్నట్టు యాక్ట్ చేయగా.. ఆల్​లైన్​లో ఉన్న వార్నర్​ నవ్వు ఆపుకోలేకపోయాడు. 

వీడియో ఆసాంతం నవ్వులు పూయించాడు. దీనికి సంబందించిన వీడియోను వార్నర్ శుక్రవారం ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశాడు. 'ఈ వీడియో నన్ను ఎంతగానో నవ్విస్తోంది. క్రేజీ టైమ్​' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు.

PREV
click me!

Recommended Stories

T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !
T20 World Cup: దటీజ్ ఇషాన్ కిషన్.. వరల్డ్ కప్ జట్టులో చోటు కోసం ఏం చేశాడో తెలుసా?