బ్రిలియంట్ అవుట్ .. వైరల్ అవుతున్న వీడియో

Published : Mar 24, 2021, 01:02 PM ISTUpdated : Mar 24, 2021, 01:39 PM IST
బ్రిలియంట్ అవుట్ .. వైరల్ అవుతున్న వీడియో

సారాంశం

ఇలా కూడా అవుట్ అవుతారా అంటూ నెటిజన్లు నవ్వుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

న్యూజిలాండ్- బంగ్లాదేశ్ మధ్య  వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. మంగళవారం  ఈ రెండు జట్లు రెండో వన్డే మ్యాచ్ కోసం తలపడ్డాయి. అయితే.. ఈ మ్యాచ్ లో ఓ విచిత్రం చోటుచేసుకుంది.  బంగ్లాదేశ్ కెప్టెన్ తమిమ్ ఇక్బాల్ అవుట్ అయిన తీరు అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇలా కూడా అవుట్ అవుతారా అంటూ నెటిజన్లు నవ్వుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

అప్పటికే 78 పరుగులతో ఊపుమీదున్న తమిమ్ అనవసర రన్‌కు ప్రయత్నించి వికెట్ చేజార్చుకున్నాడు. 31వ ఓవర్ వేస్తున్న కివీస్ ఆల్‌రౌండర్ నీషమ్ బౌలింగ్‌లో స్టైకింగ్‌లో ఉన్న ముష్ఫికర్ రహీమ్ డిఫెండ్ చేసి సింగిల్‌ తీసేందుకు ప్రయత్నించాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న తమిమ్ కూడా క్రీజు వదిలి ముందుకు పరిగెత్తాడు.


ఇంతలో నీషమ్ చాకచక్యంగా బంతిని వికెట్లవైపు తన్నాడు. అది నేరుగా వెళ్లి నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో వికెట్లను గిరాటేసింది. క్రీజులోకి చేరుకోవడం దేవుడెరుగు.. కనీసం వెనక్కి తిరిగేందుకు కూడా తమిమ్‌కు అవకాశం లభించలేదు. దీంతో బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. తమిమ్ తరువాత మిథున్(72) తప్ప మరో బ్యాట్స్‌మన్ ఎవరూ చెప్పుకొదగ్గ స్కోరు చేయలేదు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. రెండో వన్డేలో న్యూజిలాండ్‌ ఐదు వికెట్లతో నెగ్గింది. తొలుత బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 271 పరుగులు సాధించింది. అనంతరం న్యూజిలాండ్‌ 48.2 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 275 పరుగులు చేసి గెలిచింది.

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !