టీమిండియాను వదలని గాయాల బెడద... రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్‌కి గాయాలు...

Published : Mar 23, 2021, 08:51 PM IST
టీమిండియాను వదలని గాయాల బెడద... రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్‌కి గాయాలు...

సారాంశం

బ్యాటింగ్ చేస్తూ గాయపడిన రోహిత్ శర్మ... ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన శ్రేయాస్ అయ్యర్... అయ్యర్‌ని స్కానింగ్‌కి తరలించిన బీసీసీఐ... ఇంగ్లాండ్ జట్టునూ వదలని గాయాల బెడద... మోర్గాన్, సామ్ బిల్లింగ్స్‌కి గాయాలు...

వన్డే సిరీస్ ఆరంభంలోనే టీమిండియాను గాయాలు స్వాగతం పలికాయి. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయపడిన రోహిత్ శర్మ, ఫీల్డింగ్‌కి రాలేదు. రోహిత్ గాయం పరిస్థితిపై స్పష్టత లేకపోయినా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు.

అయ్యర్ గాయం తీవ్రత తెలుసుకునేందుకు స్కానింగ్‌కి తరలించినట్టు తెలిపింది బీసీసీఐ. టీమిండియాతో పాటు ఇంగ్లాండ్ జట్టును కూడా మొదటి వన్డేలో గాయాలు వేధించాయి. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చేతికి గాయమైంది.

మోర్గాన్ చేతికి మూడు కుట్లు పడినా, బ్యాటింగ్‌కి వచ్చి 22 పరుగులు చేశాడు. అలాగే సామ్ బిల్లింగ్ కూడా బౌండరీ లైన్ దగ్గర ఫోర్ ఆపబోయి గాయపడ్డాడు. బిల్లింగ్స్ కూడా బ్యాటింగ్‌కి వచ్చి 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !