India vs England : భారత్-ఇంగ్లాండ్ సిరీస్ లో అరంగేట్రం చేసిన భారత వికెట్ కీపర్ ధృవ్ జురెల్ అద్భుతమైన ఆటతో రాణిస్తున్నాడు. అరంగేట్రం మ్యాచ్ లోనే మంచి ఇన్నింగ్స్ ఆడిన జురెల్.. రాంచీలో మరోసారి ఇంగ్లాండ్ పై హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
India vs England : రాంచీ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ 4వ టెస్టు మ్యాచ్ లో టీమిండియా విజయం దిశగా ముందుకు సాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్రదర్శనతో మరో గెలుపు దిశగా పయనిస్తోంది. భారత్ తొలి ఇన్నింగ్స్ వరుస వికెట్లు కోల్పోయిన తరుణంలో సూపర్ ఇన్నింగ్స్ తో వికెట్ కీపర్ ధృవ్ జురెల్ భారత స్కోర్ ను 300 పరుగులు దాటించాడు. తొలి ఇన్నింగ్స్ చివరలో కుల్దీప్ యాదవ్ తో కలిసి 76 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని అందించాడు.
రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా 4వ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ మూడో రోజు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ధృవ్ జురెల్ మంచి ప్రదర్శన చేశాడు. తన రెండో టెస్టు మ్యాచ్ ఆడుతున్న జురెల్ భారత్ కు మంచి స్కోరు చేయడంలో సహకారం అందించి అడుగు దూరంలో సెంచరీని కోల్పోయాడు. ఈ ఇన్నింగ్స్ లో ధృవ్ జురెల్ 90 పరుగులు చేశాడు. జురెల్ తన ఇన్నింగ్స్‌లో 149 బంతుల్లో 6 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది.. 10 పరుగుల దూరంలో సెంచరీ మిస్ అయ్యాడు.
ప్రస్తుత టెస్టు సిరీస్‌లో హాఫ్ సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ధృవ్ జురెల్ నిలిచాడు. ఈ టెస్టు సిరీస్‌లో అంతకుముందు, బెన్ ఫాక్స్ చేసిన 47 పరుగులే ఒక వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అత్యధిక స్కోరు. రాజ్‌కోట్ టెస్టులో ధ్రువ్ జురెల్ 46 పరుగులకు చేరుకున్నాడు, కానీ 4 పరుగుల దూరంలో హాఫ్ సెంచరీని కోల్పోయాడు. ప్రస్తుత టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ బెన్ ఫాక్స్‌ను వికెట్ కీపర్‌గా ఉపయోగించుకుంది. కాగా, కెఎస్ భరత్ తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్ తరఫున వికెట్ కీపింగ్ చేయగా, ఆ తర్వాత ధృవ్ జురెల్ రాజ్ కోట్, రాంచీ టెస్టుల్లో అవకాశం దక్కించుకున్నాడు. ప్రస్తుత టెస్టు సిరీస్‌లో ఫాక్స్ మొత్తం 7 ఇన్నింగ్స్‌ల్లో 156 పరుగులు చేశాడు. కాగా కేఎస్ భారత్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 92 పరుగులు చేశాడు. జురెల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 68 సగటుతో 136 పరుగులు చేశాడు.
Dhruv Jurel putting up a show here in Ranchi! 👌 👌
He moves into 90 as sail past 300 👏 👏
Follow the match ▶️ https://t.co/FUbQ3Mhpq9 | pic.twitter.com/zYp9At55JX