ఇంటిపై మిడతల దండు దాడి: వీడియో షేర్ చేసిన సెహ్వాగ్

Published : Jun 27, 2020, 04:17 PM IST
ఇంటిపై మిడతల దండు దాడి: వీడియో షేర్ చేసిన సెహ్వాగ్

సారాంశం

మిడతలు ఢిల్లీపై ఎలా దాడి చేతున్నాయో చూపెడుతూ తన ఇంటిపై తిరుగుతున్న మిడతల దండును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. 

ఉత్తర భారతదేశం పై మిడతల దండ్లు దాడి చేస్తున్న విషయం తెలిసిందే. మిడతల ధాటికి ప్రజలు వణికిపోతున్నారు. ఈ మిడతలు ఇప్పుడు దేశ పంజాబ్, హర్యానా రాష్ట్రాలను ధాటి దేశ రాజధాని ఢిల్లీకి కూడా చేరాయి. 

రాజధాని ఢిల్లీలో ఈ మిడతలు అధికంగా ఉండడంతో.... విమానాల పైలట్లకు ప్రత్యేక హెచ్చరికలను, మార్గదర్శకాలను జారీచేశారు. విమాన టేక్ ఆఫ్, లాండింగ్ సమయంలో ఈ మిడతల వల్ల ఇబ్బందులు తలెత్తే ఆస్కారం ఉందని అంటున్నారు ఎయిర్ పోర్ట్ అధికారులు. 

ఇక ఈ మిడతలు ఢిల్లీపై ఎలా దాడి చేతున్నాయో చూపెడుతూ తన ఇంటిపై తిరుగుతున్న మిడతల దండును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. 

గురుగ్రామ్ తదితర ప్రాంతాల్లో ప్రజలందరూ తమ కిటికీలను మూసి ఉంచాలని ఇప్పటికే మునిసిపల్ అధికారులు ఆదేశాలను జారీచేశారు. ఇప్పుడు మిడతలు ఆ శివారు ప్రాంతాలను దాటి ఇప్పుడు రాజధానిని కుదిపేస్తున్నాయి ఈ మిడతలు. 

PREV
click me!

Recommended Stories

Tilak Varma : టీమిండియా కొత్త ఛేజ్‌మాస్టర్.. కోహ్లీ, ధోనీ రికార్డులు బద్దలు !
ఆక్షన్‌లోకి కొత్త సరుకొచ్చింది బాసూ.! వీళ్ల కోసం గట్టి పోటీ.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?