స్పీడ్ పెంచుతున్న షమీ.. తన పెంపుడు కుక్కతో కలిసి..

Published : Jun 27, 2020, 10:17 AM IST
స్పీడ్ పెంచుతున్న షమీ.. తన పెంపుడు కుక్కతో కలిసి..

సారాంశం

పరుగులో తన శునకంతో పోటీకి దిగాడు. దానితో కలిసి పరిగెత్తాడు. పరుగులో తన శునకం కంటే షమీనే ముందుండడం గమనార్హం. 

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ బౌలింగ్‌లో స్పీడ్ పెంచుకోవడానికి సరికొత్తగా ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన షమీ.. ఫిట్‌గా ఉండేందుకు మాత్రం రోజూ వర్కవుట్లు చేస్తూనే ఉన్నాడు. 

తాజాగా, శుక్రవారం షమీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బౌలింగులో వేగాన్ని మరింత మెరుగు పరుచుకునేందుకు తన పెంపుడు శునకం సాయంతో ప్రాక్టీస్ మొదలెట్టాడు. 

 

పరుగులో తన శునకంతో పోటీకి దిగాడు. దానితో కలిసి పరిగెత్తాడు. పరుగులో తన శునకం కంటే షమీనే ముందుండడం గమనార్హం. ‘స్పీడ్ వర్క్ విత్ జాక్’ అని క్యాప్షన్ తగిలించిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

మళ్లీ ఆట ప్రారంభమయ్యే నాటికి పూర్తి ఫిట్​నెస్​ను సాధించేందుకు కృషి చేస్తున్నాడు. కాగా లాక్​డౌన్ సమయంలో ప్రజలకు మాస్కులతో పాటు నిత్యావసరాలను సైతం షమీ అందించాడు. రహదారులపై వెళుతున్న వలస కార్మికులకు ఆహారాన్ని సైతం అతడు అందించిన విషయ తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

ICC Rankings : వన్డే కింగ్ ఎవరు? రోహిత్ శర్మకు ఎసరు పెట్టిన విరాట్ కోహ్లీ.. కేవలం 8 పాయింట్లు !
IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు