తండ్రులందరూ ఇంతేనా... మీరు మారరా?... గిల్, సుందర్‌ల తండ్రులపై వీరూ కామెంట్...

Published : Jan 21, 2021, 05:05 PM IST
తండ్రులందరూ ఇంతేనా... మీరు మారరా?... గిల్, సుందర్‌ల తండ్రులపై వీరూ కామెంట్...

సారాంశం

మా వోడు సెంచరీ చేయాల్సిందన్న వాషింగ్టన్ సుందర్ తండ్రి... 91 పరుగుల దగ్గర అవుట్ అవ్వడంతో నిరాశ చెందానని చెప్పిన శుబ్‌మన్ గిల్ తండ్రి... ‘తల్లిదండ్రలు ఎప్పుడూ ఇంతేనా...’ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ట్రోల్...

కొడుకు ఏం సాధించినా... ఇంకాస్త ఎక్కువ సాధిస్తే బావుండు... అనుకోవడం భారతీయ తల్లిదండ్రుల స్వభావం. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో 62 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్ విషయంలో ఆయన తండ్రి సుందర్... ‘మావోడు సెంచరీ చేస్తే బాగుండు...’ అంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా నాలుగో ఇన్నింగ్స్‌లో 91 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ విషయంలో కూడా ఆయన తండ్రి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. శుబ్‌మన్ గిల్ తండ్రి లఖ్విందర్ గిల్... ‘గిల్ సెంచరీ చేసి ఉంటే బాగుండేది. వాడు బాగా ఆడాడు, సెంచరీ చేయాల్సింది’ అంటూ కామెంట్ చేశాడు.

ఈ రెండు వార్తలను పోస్టు చేసిన వీరేంద్ర సెహ్వాగ్... ‘పేరెంట్స్... ఎప్పుడూ పేరెంట్సే... మారరు’ అంటూ కామెంట్ చేశాడు. వీరూ చేసిన ఈ పోస్టుకి లక్షల్లో లైకులు రాగా భారత క్రికెటర్లు శిఖర్ ధావన్, యజ్వేంద్ర చాహాల్, యువరాజ్ సింగ్ కూడా లైక్ చేశారు. 

 

PREV
click me!

Recommended Stories

T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !
T20 World Cup: దటీజ్ ఇషాన్ కిషన్.. వరల్డ్ కప్ జట్టులో చోటు కోసం ఏం చేశాడో తెలుసా?