ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి ముందు భారత జట్టు భారీ దెబ్బ... గాయంతో జడ్డూ అవుట్...

Published : Jan 21, 2021, 01:56 PM IST
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి ముందు భారత జట్టు భారీ దెబ్బ... గాయంతో జడ్డూ అవుట్...

సారాంశం

మూడో టెస్టులో రవీంద్ర జడేజా బొటిన వేలికి గాయం... జడ్డూ వేలికి సర్జరీ చేసిన వైద్యులు... కోలుకోవడానికి ఆరు వారాల విశ్రాంతి అవసరమని సూచించిన డాక్టర్లు... ఇంగ్లాండ్‌తో నాలుగు టెస్టుల సిరీస్ మొత్తానికి జడేజా దూరం...

ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించి, స్వదేశం చేరుకున్న భారత క్రికెట్ జట్టు, ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చెన్నై చిన్నస్వామి స్టేడియంలో జరిగే మొదటి రెండు టెస్టులకు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే భారత జట్టు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా నాలుగు టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. మూడో టెస్టులో జడేజా ఎడమచేతి బోటిన వేలుకి గాయమైంది. అలాగే బ్యాటింగ్ కొనసాగించిన జడ్డూ... నాలుగో ఇన్నింగ్స్‌లో కూడా బ్యాటింగ్ చేయడానికి సిద్ధమయ్యాడు.

అయితే విహారి, అశ్విన్ మొండి పట్టుదలతో వికెట్ పడకుండా అడ్డుకోవడంతో జడేజా బ్యాటింగ్‌కి రాలేదు. మొదటి రెండు టెస్టులకు ఎంపిక కాని జడేజా, టెస్టు సిరీస్ మొత్తానికి దూరం కావడం భారత జట్టుపై ఎంతవరకూ ప్రభావం చూపనుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !