ఆఫ్ఘాన్ కుర్రాడి సంచలనం... ఎంట్రీతోనే సెంచరీ బాదిన రెహ్మనుల్లా గుర్బజ్...

By team teluguFirst Published Jan 21, 2021, 3:37 PM IST
Highlights

మొట్టమొదటి వన్డే మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా సరికొత్త చరిత్ర...

మొదటి వన్డేలో సెంచరీ బాదిన మొట్టమొదటి ఆఫ్ఘాన్ క్రికెటర్...

21వ సెంచరీలో సెంచరీ చేసిన 21వ సెంచరీ ప్లేయర్... రషీద్ ఖాన్ హాఫ్ సెంచరీ...

ఐర్లాండ్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో ఆరంగ్రేటం చేసిన ఆఫ్ఘాన్ వికెట్ కీపర్ రెహ్మనుల్లా గుర్బజ్ సెంచరీతో చెలరేగాడు. ఆరంగ్రేటం మ్యాచ్‌లోనే అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన ఓపెనర్‌గా నిలిచిన రెహ్మనుల్లా... 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఆ తర్వాత కూడా జోరు కొనసాగించిన రెహ్మనుల్లా... మొట్టమొదటి వన్డే మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా నిలిచాడు. మొత్తంగా 127 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్లతో 127 పరుగులు చేసిన రెహ్మనుల్లా... వన్డేల్లో శతకం బాదిన 21వ సెంచరీలో పుట్టిన క్రికెటర్‌గా నిలిచాడు.

రెహ్మనుల్లా సెంచరీ 2021వ ఏడాదిలో 21వ రోజు రావడం మరో విశేషం. ఆఫ్ఘాన్ తరుపున ఆరంగ్రేటం వన్డేలోనే సెంచరీ బాదిన మొట్టమొదటి క్రికెటర్ కూడా రెహ్మనుల్లానే. 19 ఏళ్ల 54 రోజుల వయసున్న రెహ్మనుల్లా ఇన్నింగ్స్ కారణంగా మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరూ విఫలమైన మంచి స్కోరు చేసింది ఆఫ్ఘాన్.

ఐర్లాండ్ బౌలర్ ఆండీ మెక్‌బ్రైన్‌కి 5 వికెట్లు దక్కడం విశేషం. ఆఖరి ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాదిన రషీద్ ఖాన్, 30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది ఆఫ్ఘాన్.

click me!