‘విరాట్ కోహ్లీ ఇంకో సెంచరీ చేస్తాడేమో అనుకున్నాం... విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాక స్టేడియంలో సైలెన్స్ గమనించాం... - ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్..
‘భారత్‌లో ప్రపంచ కప్ ఫైనల్ అంటే ఫ్యాన్స్ అందరూ వాళ్లకే సపోర్ట్ చేస్తారు. మాకు సపోర్ట్ ఉండదు. లక్షా 30 మందిని సైలెంట్‌గా ఉంచడం కంటే గొప్ప విజయం ఏముంటుంది?’ వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌కి ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ చేసిన కామెంట్లు ఇవి. చెప్పి మరీ కొట్టినట్టుగా, భారత జట్టును ఓడించి... స్టేడియంలో ఉన్న లక్ష మంది క్రికెట్ ఫ్యాన్స్ బాధతో మూగబోయేలా చేశాడు కమ్మిన్స్...
‘విరాట్ కోహ్లీ ఇంకో సెంచరీ చేస్తాడేమో అనుకున్నాం. అతను క్రీజులో సెటిల్ అయితే అవుట్ చేయడం చాలా కష్టం. విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాక స్టేడియంలో సైలెన్స్ గమనించాం. అది నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. విరాట్ సెంచరీ చేసి ఉంటే, భారత జట్టు ఈజీగా 280-300 పరుగులు చేసి ఉండేది..’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్...
2007లో రికీ పాంటింగ్ కెప్టెన్సీలో వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు, 2015లో మైకేల్ క్లార్క్ కెప్టెన్సీలో ప్రపంచ కప్ కైవసం చేసుకుంది. 2021లో ఆరోన్ ఫించ్ కెప్టెన్సీలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా, ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 టైటిల్‌తో పాటు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టైటిల్ కూడా గెలిచింది..