‘మీ వల్ల 130 కోట్ల మంది బాధపడుతున్నారు డేవిడ్ భాయ్’ డేవిడ్ వార్నర్ పోస్ట్‌పై ఓ క్రికెట్ ఫ్యాన్ కామెంట్... క్షమాపణలు కోరుతూ రిప్లై ఇచ్చిన వార్నర్..
కెరీర్ ఆరంభంలో దురుసుగా ప్రవర్తిస్తూ, ఓ పొగరుబోతులా కనిపించాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. అయితే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లోకి వచ్చిన తర్వాత వార్నర్ భాయ్ వాలకం మొత్తం మారిపోయింది. తెలుగువారికి ఇష్టమైన ఫారిన్ క్రికెటర్‌గా మారిన డేవిడ్ వార్నర్, తనకి భారతీయులంటే ఉన్న ఇష్టాన్ని వీలైనప్పుడల్లా చూపిస్తూనే ఉన్నాడు..
‘బుట్టబొమ్మ’ సాంగ్‌కి మిలియన్ల వ్యూస్ రావడానికి డేవిడ్ వార్నడ్ ముఖ్య కారణం. ఈ విషయాన్ని అల్లు అర్జున్ కూడా ఓ కార్యక్రమంలో ఒప్పుకున్నాడు. తాజాగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత జట్టుని ఓడించి, ఆరోసారి టైటిల్ ఎగరేసుకుపోయింది ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెబుతూ వార్నర్ చేసిన కామెంట్ ట్రెండ్ అవుతోంది..
‘ఇంత అద్భుతంగా వరల్డ్ కప్‌ని నిర్వహించిన భారత్‌కి థ్యాంక్ యూ. ఈ ఈవెంట్స్ సజావుగా నిర్వహించడానికి మీరు ప్రడిన శ్రమ ప్రశంసనీయం. ఈ టోర్నీ విజయవంతం కావడానికి కష్టపడిన గ్రాండ్ స్టాఫ్, డ్రెస్సింగ్ రూమ్ స్టాఫ్, కిచెన్ స్టాఫ్, చెఫ్స్, హోటల్ స్టాఫ్, సెక్యూరిటీ, పోలీసులు, ఈవెంట్ ఆర్గనైజర్లు.. ఫ్యాన్స్.. అందరికీ థ్యాంక్ూ.
ఎయిర్‌పోర్ట్ దాకా బ్లాక్ అయిన రోడ్లను చూసినప్పుడు మీరు క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ఎంత ఇష్టపడతారో, ఎంత ఓపిక చూపిస్తారో అర్థమైంది. మీరు లేకపోతే ఈ ఇష్టమైన ఆటను ఆడలేము. భారత జట్టు టైటిల్ గెలవలేకపోయింది. అయితే వాళ్ల ఆడిన ఆట అసాధారణం. ఆరోసారి ఛాంపియన్స్‌గా నిలవడం గర్వకారణంగా ఉంది. టీమ్ అంతా ఎంతో సంతోషంగా ఉంది. ప్రతీ ఒక్కరికీ మరోసారి థ్యాంక్యూ. 2027లో మళ్లీ కలుద్దాం..’ అంటూ పోస్ట్ చేశాడు డేవిడ్ వార్నర్.
‘మీ వల్ల 130 కోట్ల మంది బాధపడుతున్నారు డేవిడ్ భాయ్’ అంటూ ఓ క్రికెట్ ఫ్యాన్, డేవిడ్ వార్నర్ పోస్ట్‌పై కామెంట్ చేశాడు. దీనికి ‘క్షమించండి. వరల్డ్ కప్ గెలవకపోయినా వాళ్లు ఆడిన తోపు..’ అంటూ రిప్లై ఇచ్చాడు డేవిడ్ వార్నర్..