కోహ్లీ ని అలా చూసి ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..!

Published : Aug 02, 2023, 10:00 AM ISTUpdated : Aug 02, 2023, 10:06 AM IST
  కోహ్లీ ని అలా చూసి ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..!

సారాంశం

ఈ మ్యాచ్ లో కోహ్లీ మైదానంలో లేకపోవడం ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టింది. అయితే, ఇది మాత్రమే కాదు, కోహ్లీ సబ్ స్టిట్యూట్ క్రికెటర్ గా చూసి ఫ్యాన్స్ మరింత ఇబ్బంది పడటం గమనార్హం.


రెండో వన్డేలో వెస్టిండీస్ చేతుల్లో ఊహించని పరాజయం ఎదుర్కొన్న టీమిండియా, ఆఖరి వన్డేలో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్... ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి విండీస్‌పై ఘన విజయం అందుకుంది.352 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బరిలో దిగిన వెస్టిండీస్, 35.5 ఓవర్లలో 151 పరుగులకి ఆలౌట్ అయ్యింది. టీమిండియాకి 200 పరుగుల తేడాతో భారీ విజయం దక్కింది.

ఈ సిరీస్ ని టీమిండియా చేజిక్కించుకోవడం ఫ్యాన్స్ ని చాలా సంతోషపెట్టింది. కానీ,  ఈ మ్యాచ్ లో కోహ్లీ మైదానంలో లేకపోవడం ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టింది. అయితే, ఇది మాత్రమే కాదు, కోహ్లీ సబ్ స్టిట్యూట్ క్రికెటర్ గా చూసి ఫ్యాన్స్ మరింత ఇబ్బంది పడటం గమనార్హం.

బార్బడోస్ లో జరిగిన తొలి మ్యాచ్ నుంచే మేనేజ్మెంట్ ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేశారు. ఈ మార్పుల్లో భాగంగానే కెప్టెన్ రోహిత్ శర్మ సహా కోహ్లీ లోయర్ ఆర్డర్ లో ఆడేందుకు సిద్ధమయ్యారు. అయితే, కోహ్లీ బ్యాటింగ్ కి రావాల్సిన అవసరం లేకుండానే రోహిత్ తొలి వన్డే లో భారత్ విజయం అందుకుంది. ఇక, రెండో వన్డేలో మరిన్ని ప్రయోగాలు చేశారు. కానీ, అవి కూడా బెడసి కొట్టాయి. దీంతో, మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది.

 

ఈ మార్పుల్లో భాగంగానే మూడో మ్యాచ్ లోనూ కోహ్లీ, రోహిత్ లను పక్కన పెట్టారు. అయితే, వారు లేకున్నా, మూడో మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. అయితే, రెండో వన్డే మ్యాచ్ సమయంలో కోహ్లీ వాటర్ బాయ్  అవతారమెత్తాడు. అలా చూసే ఫ్యాన్స్ బాధపడగా, ఇక మూడో మ్యాచ్ లో సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ గా కనిపించడం గమనార్హం.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే, బ్యాటింగ్ చేత పట్టి, రికార్డులు క్రియేట్ చేయాల్సిన కోహ్లీని, ఇలా చూసి ఫ్యాన్స్ తెగ ఫీలౌతున్నారు. 

PREV
click me!

Recommended Stories

IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
IPL Mini Auction చరిత్రలో అత్యంత ఖరీదైన 6 ఆటగాళ్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?