డేవిడ్ వార్నర్ కూతురికి స్పెషల్ గిఫ్ట్ పంపిన విరాట్ కోహ్లీ... బుల్లి ఫ్యాన్ ఆనందం...

Published : Jan 31, 2021, 11:20 AM IST
డేవిడ్ వార్నర్ కూతురికి స్పెషల్ గిఫ్ట్ పంపిన విరాట్ కోహ్లీ... బుల్లి ఫ్యాన్ ఆనందం...

సారాంశం

బుల్లి అభిమానికి కానుకగా తాను సంతకం చేసిన టెస్టు జెర్సీని పంపిన విరాట్ కోహ్లీ...  విరాట్ జెర్సీని ధరించి సంతోషంగా మురిసిపోయిన ఇండీ వార్నర్... తనకంటే, ఫించ్ కంటే ఎక్కువగా విరాట్ కోహ్లీనే విరాభిమాని అంటూ వార్నర్ పోస్ట్

భారత సారథి విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. భారతదేశంతో పాటు పొరుగుదేశం పాకిస్తాన్‌లో కూడా విరాట్‌కి వీరాభిమానులు ఉన్నారు. ఆస్ట్రేలియా ఓపెనర్, స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ కూతురు ఇండీ వార్నర్ కూడా కోహ్లీకి వీరాభిమాని. ఈ విషయాన్ని చాలాసార్లు ప్రకటించారు వార్నర్,ఆయన భార్య క్యాండీ వార్నర్.

తన బుల్లి అభిమానికి కానుకగా తాను సంతకం చేసిన టెస్టు జెర్సీని పంపించాడట విరాట్ కోహ్లీ... ఈ జెర్సీని ధరించిన ఇండీ, సంతోషంగా మురిసిపోతూ విరాట్ కోహ్లీకి థ్యాంక్స్ చెప్పింది... 

‘అవును మేం సిరీస్ ఓడిపోయాం... కానీ మా ఇంట్లో కూడా ఓ హ్యాపీ గర్ల్ ఉంది... తన జెర్సీని ఇండీకి కానుకగా పంపిన విరాట్ కోహ్లీకి థ్యాంక్స్... ఇండీకి ఇది ఎంతో నచ్చింది. నాకంటే, ఆరోన్ ఫించ్ కంటే తను విరాట్ కోహ్లీనే ఎక్కువగా ఇష్టపడుతుంది’ అంటూ పోస్టు చేశాడు వార్నర్ భాయ్. 

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?