మొక్కు తీర్చుకున్న నటరాజన్... పళని మురుగన్ ఆలయంలో తలనీలాలు ఇచ్చిన నట్టూ...

Published : Jan 30, 2021, 03:20 PM IST
మొక్కు తీర్చుకున్న నటరాజన్... పళని మురుగన్ ఆలయంలో తలనీలాలు ఇచ్చిన నట్టూ...

సారాంశం

ఐపీఎల్ 2020 సీజన్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన నటరాజన్.. ఆస్ట్రేలియా టూర్‌లో అద్భుతంగా రాణించిన నట్టూ... ఒకే టూర్‌లో అన్ని ఫార్మాట్లలోనూ ఎంట్రీ ఇచ్చిన నటరాజన్...

ఐపీఎల్ 2020 సీజన్ నుంచి టి. నటరాజన్ కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. అనుకోకుండా భారత జట్టులో చోటు దక్కించుకున్న నటరాజన్... ఒకే టూర్‌లో వన్డే, టీ20, టెస్టు సిరీస్‌ల్లో ఎంట్రీ ఇచ్చిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచి, రికార్డు క్రియేట్ చేశాడు...

ఆఖరి వన్డేతో పాటు టీ20 సిరీస్‌లోనూ అదరగొట్టే పర్ఫామెన్స్ ఇచ్చిన నటరాజన్... విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆఖరి టెస్టులో ఎంట్రీ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టిన నటరాజన్‌కి స్వదేశంలో జీవితాంతం గుర్తిండిపోయే రేంజ్‌లో స్వాగతం లభించింది.

తమిళనాడులోని సేలం ఏరియాకి చెందిన నటరాజన్... పళని మురుగున్ స్వామి దేవాలయాన్ని సందర్శించుకుని, తలనీలాలు సమర్పించుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగే మొదటి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో నటరాజన్‌కి చోటు దక్కలేదు. అయితే వన్డే, టీ20 సిరీస్‌లో నట్టూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.

PREV
click me!

Recommended Stories

T20 World Cup 2026 లో బిగ్ ట్విస్ట్.. పాకిస్థాన్ ప్లేస్‌లో ఆ టీమ్ వస్తే రచ్చ రచ్చే !
T20 World Cup 2026 : రూ. 220 కోట్లు గోవిందా.. బంగ్లాదేశ్ కు ఐసీసీ బిగ్ షాక్