ఒక్క ఫోర్ కే సంబరాలు చేసుకున్న కోహ్లీ.. ఎందుకో తెలుసా?

Published : Jul 14, 2023, 11:47 AM IST
ఒక్క ఫోర్ కే సంబరాలు చేసుకున్న కోహ్లీ.. ఎందుకో తెలుసా?

సారాంశం

నిజానికి ఫోర్లు కొట్టడం కోహ్లీకి చాలా సులువైన పని. అలాంటిది కేవలం ఒక్క ఫోర్ కే ఆనందం వ్యక్తం చేయడం విశేషం. దానికి కారణం లేకపోలేదు. ఆయన దాదాపు 81 బాల్స్ తర్వాత ఫోర్ కొట్టాడు. అందుకే అంత సంబరపడటం విశేషం.

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ  గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన స్టేడియంలోకి అడుగుపెడితే ఫ్యాన్స్ కి ఫుల్ ఆనందపడిపోతూ ఉంటారు. అంతేకాదు, ఆయనకు పరుగుల రారాజు అనే బిరుదు కూడా ఉంది. అలాంటి ఆయన కేవలం ఒక్క ఫోర్ కే సంబరాలు చేసుకున్నాడు. నిజానికి ఫోర్లు కొట్టడం కోహ్లీకి చాలా సులువైన పని. అలాంటిది కేవలం ఒక్క ఫోర్ కే ఆనందం వ్యక్తం చేయడం విశేషం. దానికి కారణం లేకపోలేదు. ఆయన దాదాపు 81 బాల్స్ తర్వాత ఫోర్ కొట్టాడు. అందుకే అంత సంబరపడటం విశేషం.

81 బంతులకు ఫోర్ కొట్టడాన్ని కూడా తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. సెంచరీ పూర్తయిందా అనే అనుమానం వచ్చేలా.. యెస్ యెస్.. నేను సాధించాను అనే విధంగా నవ్వుతూ డగౌట్‌లో ఉన్న సహచర ఆటగాళ్లకు సంజ్ఞ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.

 


ఇదిలా ఉండగా, వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో పూర్తిగా టీమిండియాదే ఆధిపత్యం సాధించింది. తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా విజయఢంకా మోగిస్తోంది. వెస్టిండీస్ పై 162 పరుగుల ఆధిక్యంలో భారత్ ఉంది. వెస్టిండీస్ 150 పరుగులకి ఆల్ అవుట్ అయింది. యశస్వి జైస్వాల్  చిచ్చరపిడుగులా చెలరేగి తొలి ఇన్నింగ్స్ లోనే సత్తా చాటాడు.  ఆరెంగేట్రంలోనే అదరగొట్టాడు. 

సెంచరీస్ తో అజయంగా దూసుకుపోయాడు. 143 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు. 350 బంతుల్లో జైస్వాల్.. 143 పరుగులు చేశాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ కూడా సెంచరీతో అదరగొట్టేశాడు. కోహ్లీ 96 బంతుల్లో 36 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. అంతకుముందు రోహిత్ శర్మ 221 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ఆ తర్వాత అవుట్ అయ్యాడు. అయితే ఆటకు ఇంకా మూడు రోజుల సమయం ఉంది. రహానే, జడేజా, ఇషాన్ కిషన్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంది. దీంతో టీమిండియా భారీ స్కోరు చేసే అవకాశం ఉంది.అరంగేట్రం టెస్టులోనే యశస్వి జైస్వాల్  సెంచరీ కొట్టి దూసుకుపోతూ రికార్డుల మూత మోగించాడు.

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !