రోహిత్ షాట్‌కు విరాట్ నవ్వులు

Siva Kodati |  
Published : Mar 29, 2019, 11:41 AM IST
రోహిత్ షాట్‌కు విరాట్ నవ్వులు

సారాంశం

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిన షాట్‌‌కి బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ చిరు నవ్వులు చిందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఐపీఎల్ 2019లో భాగంగా గురువారం రాత్రి బెంగళూరు, ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిన షాట్‌‌కి బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ చిరు నవ్వులు చిందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ముంబై ముందుగా బ్యాటింగ్ చేసింది. రోహిత్ శర్మ, డీకాక్‌లు ఓపెనింగ్‌కు దిగారు. వీరిద్దరూ జట్టుకు శుభారంభాన్ని అందించారు. ముఖ్యంగా రోహిత్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

ఈ దశలో సిరాజ్ బౌలింగ్‌లో 5వ లాస్ట్ బాల్‌కి రోహిత్ ఔట్ సైడ్ లాంగాన్ దిశగా మంచి కవర్ డ్రైవ్ కొట్టాడు. దీనిని మిడ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న ఏబీ డివిలియర్స్ అడ్డుకోలేకపోవడంతో బంతి బౌండరీ లైన్‌ను తాకింది. ఈ సమయంలో విరాట్.. రోహిత్ వైపు చూస్తు చిరునవ్వులు చిందించాడు. ఈ వీడియోను ఐపీఎల్ ట్వీట్టర్‌లో పెట్టింది. 

PREV
click me!

Recommended Stories

IND vs BAN : తగ్గేదే లే.. బంగ్లాదేశ్ కు ఇచ్చిపడేసిన భారత్.. గ్రౌండ్‌లో హీట్ పుట్టించిన కెప్టెన్లు !
Vaibhav Suryavanshi : ఊచకోత అంటే ఇదే.. బంగ్లా బౌలర్లని ఉతికారేసిన వైభవ్ ! కోహ్లీ రికార్డు పాయే